Actress Samantha: ఏమాయ చేసావె సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన సమంత… తనదైన నటనతో స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. 2017 లో చైతన్యను వివాహం చేసుకుని… ఇటీవల వారి వివాహ బంధానికి వీడ్కోలు పలుకుతూ తాము విడిపోబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా విడాకుల తర్వాత కూడా ఫుల్ బిజీగా ఉంటుంది సమంత. ప్రస్తుతం సామ్ ఫోకస్ మొత్తం తన కెరీర్‌పైనే పెట్టినట్లు కనపిస్తోంది. ఈ క్రమం లోనే వరుసగా సినిమాలకు ఓకే చెప్తూ… విభిన్న పాత్రలను ఎంచుకునేందుకు మక్కువ చూపుతున్నట్లు తెలుస్తోంది.

అయితే ఇప్పుడు సమంత తన అభిమానులకు ఓ గుడ్ న్యూస్ ప్రకటించింది. కాగ కొంత కాలంగా సమంత హాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తుందని, ఒక అంతర్జాతీయ డైరెక్టర్ ను కూడా కలిసిందని వార్తలు వచ్చాయి. ఇప్పడు ఆ వార్తలను నిజం చేస్తూ సమంత హాలీవుడ్ లో కి ఎంట్రీ ఇస్తున్నట్లు అదికారికంగా ప్రకటించింది. ” అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్ ” అనే టైటిల్ తో ఈ సినిమా రాబోతుంది. ప్రముఖ నవలిస్ట్ టైమెరి ఎన్. మురారి రచించిన అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్ అనే నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కబోతుంది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టర్ ని రిలీజ్ చేసి అనౌన్స్ చేసింది ఈ ముద్దుగుమ్మ.
https://twitter.com/Samanthaprabhu2/status/1464082897334267910?s=20
Also Read: Priyanka-Nick: విడాకుల వదంతులపై ప్రియాంక దంపతులు స్పందన.. ఆ ఒక్క పోస్ట్‌తో రూమర్స్‌కు చెక్
ఈ సినిమా కు కధ, దర్శకత్వం బాధ్యతలను ఫిలిప్ జాన్ నిర్వహిస్తున్నారు. సహ రచయిత గా నిమ్మి హరస్గామ వ్యవహరించనున్నాడు. అలాగే ఈ ఈ చిత్రానికి సునీత తాటి నిర్మాతగా చేస్తుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
Also Read: Venkatesh: ‘వెంకీ’కి ఆ పేరు ఎలా వచ్చిందంటే ?