‘అక్కినేని సమంత’ ఒకప్పుడు డబ్బు కోసం నటి అయి, ఇప్పుడు మంచి నటి అనిపించుకోవడానికి డబ్బును కూడా వదులుకుంటున్న నటి. ఏమిటి ? సామ్ గురించేనా ఇది ! అవును, సామ్ కెరీర్ లో ఎన్నో పాత్రలు పోషించి మెప్పించింది. అదృష్టం కలిసి వచ్చి.. ఉన్నత స్థితికి చేరుకుంది. ముఖ్యంగా అక్కినేని ఇంటి కోడలు అయ్యాక సామ్ లో నటి మేల్కొంది.
పెళ్లికి ముందు వరకు కేవలం రెమ్యునరేషన్ కోసం ఏ సినిమా పడితే ఆ సినిమా చేసిన సామ్.. పెళ్లి తర్వాత మాత్రం, తనకు నటిగా గుర్తింపును ఇచ్చే పాత్రలే చేస్తూ ముందుకు పోతుంది. ఈ క్రమంలోనే ఫ్యామిలీ మేన్ సిరీస్ లో విలన్ గా కూడా నటించి అలరించింది. కానీ ఎప్పటి నుండో సమంతకి ఒక కోరిక ఉంది. అవును, మహారాణి పాత్రలో కనిపించాలని.
మొత్తానికి సామ్ కోరికను గుణశేఖర్ తీరుస్తున్నాడు. గుణశేఖర్ దర్శకత్వంలో వస్తోన్న శాకుంతలం సినిమాలో సామ్ కొన్ని నిమిషాల పాటు మహారాణి లుక్స్ లో కనిపించబోతుంది. ఇక మరో కీలక పాత్ర దుష్యంతుడి పాత్రలో మలయాళలం నటుడు దేవ్ కనిపించబోతున్న సంగతి తెలిసిందే. సామ్ – దేవ్ ల మధ్య భారీ రొమాంటిక్ సాంగ్ ఉందట.
గుణశేఖర్ ఈ సినిమా కోసం భారీగా ఖర్చు పెడుతున్నారు. నిజానికి ఇది సామ్ రేంజ్ బడ్జెట్ కాదు. అందుకే ఈ సినిమా రెమ్యునరేషన్ లో సగం వదులుకుంటుంది. కారణం, ఇలాంటి సినిమా చేయాలనే కోరికనట. మొత్తమ్మీద తన కోరిక తీర్చుకోవడానికి డబ్బును కూడా వదులుకుంది సమంత. మరి డబ్బు కూడా వదులుకుంటున్న శాకుంతలం ప్రాజెక్టు, సామ్ కి ఎలాంటి ఇమేజ్ ను ఇస్తోందో చూడాలి.
అయితే, సామ్ పిల్లలను ప్లాన్ చేసుకునే నేపథ్యంలో ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేస్తుందనే ఊహాగానాల వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో సమంత ఓకే చేసిన సినిమా ఇది ఒక్కటే.