Samajavaragamana Collections: విడుదలకు రెండు రోజుల ముందే స్పెషల్ ప్రీమియర్ షో ద్వారా అద్భుతమైన పాజిటివ్ టాక్ ని తెచ్చుకున్న చిత్రం ‘సామజవరగమనా’. వరుస ఫ్లాప్స్ తో డీలాపడిన శ్రీ విష్ణు హీరో గా నటించిన ఈ చిత్రం నేడు గ్రాండ్ గా విడుదలైంది. విడుదలైన మొదటి ఆట నుండే ఈ చిత్రానికి ఊహించిన దానికంటే ఎక్కువ పాజిటివ్ టాక్ రావడం తో మేకర్స్ సంబరాలు చేసుకున్నారు.
కానీ ఓపెనింగ్స్ మాత్రం టాక్ కి తగ్గట్టుగా లేవు. బక్రీద్ లాంటి పెద్ద పండుగ రోజే వసూళ్లు రాకపోతే, ఇంకా మామూలు వర్కింగ్ డేస్ లో వసూళ్లు ఏమొస్తాయని ట్రేడ్ పండితులు వాపోతున్నారు.చాలా మెయిన్ సెంటర్స్ లో మూడు వారల క్రితం విడుదలైన ప్రభాస్ ‘ఆదిపురుష్’ చిత్రానికి దీనికంటే అద్భుతమైన ఆక్యుపెన్సీలు నమోదు చేసుకుంది. పాజిటివ్ టాక్ తో కూడా ఇవేమి అవసూల్లు అంటూ ఈ చిత్రాన్ని కొనుగోలు చేసిన బయ్యర్స్ ఆందోళన చెందుతున్నారు.
ఇక ట్రేడ్ పండితులు చెప్తున్న లెక్క ప్రకారం చూస్తే ఈ సినిమాకి నైజాం లో మొదటి రోజు 80 నుండి 90 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయని అంటున్నారు. నూన్ షోస్ ప్రారంభం నుండే అతి తక్కువ ఆక్యుపెన్సీ తో ప్రారంభం అయ్యింది. చిన్న సినిమా కదా, ఇలాగే ఉంటుంది అని అందరూ అనుకున్నారు, కానీ మ్యాట్నీస్ నుండి కూడా ఎలాంటి గ్రోత్ లేదు.
అందువల్ల రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ చిత్రానికి మొదటి రోజు రెండు కోట్ల రూపాయిల గ్రాస్ మరియు కోటి రూపాయిల షేర్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇది శ్రీ విష్ణు రేంజ్ కి డీసెంట్ ఓపెనింగ్ అయ్యినప్పటికీ , వచ్చిన టాక్ కి తగ్గ ఓపెనింగ్ కాదనే చెప్పాలి. ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా నాలుగు కోట్ల రూపాయిల వరకు జరిగింది. పాజిటివ్ టాక్ మరియు లాంగ్ వీకెండ్ ఈ సినిమాని కాపాడాలి.