Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi's God Father : 'ఇప్పుడే తొందరెందుకు... ‘గాడ్ ఫాదర్’ డైరెక్టర్ చిరాకు !

Chiranjeevi’s God Father : ‘ఇప్పుడే తొందరెందుకు… ‘గాడ్ ఫాదర్’ డైరెక్టర్ చిరాకు !

Godfather movie 2021Chiranjeevi’s God Father: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘గాడ్ ఫాదర్ ’(‘God Father’) సినిమాలో చాలా కీలక పాత్రలు ఉన్నాయి. ఆ పాత్రల్లో కేవలం ప్రముఖులే నటించాలి. ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) ఓ కీలక పాత్రలో నటించడానికి అంగీకరించాడని మేము గతంలోనే ఎక్స్ క్లూజివ్ గా వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే, సల్మాన్ ఖాన్ ది ఈ సినిమాలో చిన్న అతిథి పాత్ర మాత్రమే. కానీ సల్మాన్ ఖాన్ లాంటి హీరో ఒక్క క్షణం దర్శనమిచ్చినా ఆ సినిమాకి వచ్చే క్రేజ్ వేరు.

ఎలాగైనా బాలీవుడ్ మార్కెట్ ను టార్గెట్ చేయాలనే ఉద్దేశ్యంతో గాడ్ ఫాదర్ టీమ్ సల్మాన్ ను ఎన్నుకున్నారు .అయితే, సల్మాన్ ఖాన్ తమ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడని ఇప్పట్లో ప్రకటించే ఆలోచనలో లేరు ‘గాడ్ ఫాదర్’ మేకర్స్. కానీ నెటిజన్లు చూస్తూ ఊరుకోరు కదా. అవకాశం ఉంటే ఎప్పుడెప్పుడు అప్ డేట్లు అడిగేద్దామా అన్నట్టు ఉంటారు.

తాజాగా గాడ్ ఫాదర్ డైరెక్టర్ ‘మోహన్ రాజా’కు ట్విట్టర్ స్పేస్ లో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. నెటిజన్ ఈ విధంగా అడుగుతూ.. ‘సల్మాన్ ఖాన్ గాడ్ ఫాదర్ సినిమాలో నటిస్తున్నారా ?’ అంటూ ఒక క్వశ్చన్ అడిగాడు. ఈ ప్రశ్నకు మోహన్ రాజా కూడా తనదైన శైలిలో సమాధానం చెప్పారు.

‘ఇప్పుడే తొందరెందుకు చెప్పండి. మీరు అందరూ మాట్లాడుకునే రేంజులోనే ఈ సినిమా అప్డేట్లు ఉండబోతున్నాయి’ అంటూ రిప్లై ఇచ్చాడు గాని, ఇంతకీ అసలు విషయం చెప్పలేదు. ఇక సల్మాన్ ఖాన్ కు, మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీకి మధ్య మంచి అనుబంధం ఉంది. ఆ అనుబంధం కారణంగానే సల్మాన్ ఖాన్ చిరు సినిమాలో నటించడానికి అంగీకరించారు.

ఇక ప్రస్తుతం ‘గాడ్ ఫాదర్’ చిత్రం చిత్రీకరణ హైదరాబాద్ లో ఓ ప్రవేట్ ప్లేస్ లో శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రల్లో నయనతార, సత్యదేవ్ నటించనున్నారు. తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version