Salman Khan: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో సూపర్ స్టార్స్ గా పిలవబడే అతి తక్కువ మందిలో ఒకరు సల్మాన్ ఖాన్..ఈ సినిమాలు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనాలు సృష్టిస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..టాక్ తో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని బద్దలు కొట్టడం సల్మాన్ ఖాన్ ప్రత్యేకత..అందుకే ఆయన ఎంత రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిన వెనకాడకుండా ఇవ్వడానికి ముందుకి వస్తుంటారు నిర్మాతలు..ఇది ఇలా ఉండగా మన ఇండియాలో బిగ్ బాస్ షో మొట్టమొదట ప్రారంభం అయ్యింది సల్మాన్ ఖాన్ ద్వారానే..ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో ప్రభంజనం సృష్టించిన ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో మన ఇండియా లో కూడా అద్భుతమైన విజయం సాధించింది..బాలీవుడ్ లో ఈ షో బంపర్ హిట్ అయ్యేలోపు తెలుగు , మలయాళం , తమిళం మరియు కన్నడ బాషలలో కూడా ఈ రియాలిటీ షో ప్రారంభమై ఘనవిజయం సాధించింది..తెలుగు లో కూడా ఈ రియాలిటీ ఇప్పటికే 5 సీసన్స్ పూర్తి చేసుకొని ఆరవ సీసన్ ప్రారంభం అవ్వడానికి సిద్ధంగా ఉంది.

హిందీ లో ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఇప్పటికే 15 సీసన్స్ దిగ్విజయంగా పూర్తి చేసుకుంది..ఈ 15 సీసన్స్ కి కూడా సల్మాన్ ఖాన్ గారే వ్యాఖ్యాతగా వ్యవహరించారు..అన్ని సీసన్స్ ఒక దానిని మించి ఒకటి బంపర్ హిట్ అయ్యాయి..ఇది ఇలా ఉండగా సల్మాన్ ఖాన్ కి బిగ్ బాస్ 15 కి దాదాపుగా 350 కోట్ల రూపాయిలు పారితోషికం ఇచ్చినట్టు సమాచారం..ఈ సీసన్ తర్వాత సల్మాన్ ఖాన్ ఇక బిగ్ బాస్ చెయ్యను అని ప్రకటించాడు..కానీ బిగ్ బాస్ యాజమాన్యం పట్టుబట్టింది..ఎంత కుదరదు అని చెప్పినా కూడా వెయ్యి కోట్ల రూపాయిల పారితోషికం ని ఆఫర్ చేసింది.
Also Read: Producers Worried About Extra Cost: హీరోల అదనపు ఖర్చులకు నిర్మాతలు గగ్గోలు

ఒక టీవీ షో కి వెయ్యి కోట్ల రూపాయిల పారితోషికం అందుకుంటున్న ఏకైక స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మాత్రమే అని చెప్పొచ్చు..సల్మాన్ ఖాన్ ఒక్కో సినిమాకి 80 నుండి వంద కోట్ల రూపాయిలు పారితోషికం అందుకుంటాడు..ఇండియా లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న టాప్ స్టార్స్ లో సల్మాన్ ఖాన్ కూడా ఒకడు..ఇప్పుడు బిగ్ బాస్ వ్యాఖ్యాతగా ఇండియా లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరో కూడా సల్మాన్ ఖాన్ అవ్వడం విశేషం..ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ‘లభి ఈద్ కభీ దీవాలి’ అనే సినిమాలో నటిస్తున్నాడు..ఈ సినిమా తో పాటుగా ఆయన మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించాడు.