Salman Khan Accident: స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కి ప్రమాదం జరిగింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తెలియజేశారు. సోషల్ మీడియా వేదికగా తన గాయాన్ని చూపించారు. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం టైగర్ 3 మూవీలో నటిస్తున్నారు. ఏక్తా టైగర్, టైగర్ జిందా హై చిత్రాలకు ఇది సీక్వెల్. ఓ యాక్షన్ సీక్వెన్స్ లో సల్మాన్ ఖాన్ పాల్గొంటున్నారట. ఈ క్రమంలో ఆయన భుజానికి గాయమైంది. వెంటనే సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స చేశారు. అయితే కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. గాయం చిన్నదే అని వైద్యులు తెలియజేశారట.
సల్మాన్ ఖాన్ ఎడమ భుజం మీద పట్టీలు అతికించారు. మన భుజాల మీద పెద్ద బాధ్యతలు ఉన్నప్పుడు గాయాలు సహజం అని సల్మాన్ ఖాన్ తనకు జరిగిన ప్రమాదం గురించి కామెంట్ చేశారు. చిన్న గాయంతో సల్మాన్ బయటపడిన నేపథ్యంలో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. త్వరగా కోలుకోవాలని విష్ చేస్తున్నారు. టైగర్ 3లో షారుక్ ఖాన్ సైతం తళుక్కున మెరవనున్నారు. వీరిద్దరి మధ్య అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉందట. షారుక్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ పఠాన్ లో సల్మాన్ క్యామియో రోల్ చేసిన విషయం తెలిసిందే.
టైగర్ 3 చిత్రానికి మనీష్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. సల్మాన్ ఖాన్ కి జంటగా కత్రినా కైఫ్ నటిస్తుంది. ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. సల్మాన్ ఖాన్ వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్నారు. ఆయన రేంజ్ హిట్ కొట్టి ఏళ్ళు గడచిపోతుంది. దీంతో కమ్ బ్యాక్ కావాలని గట్టి ప్రయత్నం చేస్తున్నారు.
ఆయన లేటెస్ట్ మూవీ కిసీ కా భాయ్ కిసీ కి జాన్ ఆశించిన స్థాయిలో ఆడలేదు. తమిళ్ హిట్ మూవీ వీరం కి రీమేక్ గా కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ తెరకెక్కింది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. హీరో వెంకటేష్ కీలక రోల్ చేశారు. రంజాన్ కానుకగా విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఫర్హాన్ సామ్జీ తెరకెక్కించిన కీసీ కా భాయ్ కిసీ కి జాన్ నిరాశపరిచింది.
Wen u think u r carrying the weight of the world on your shoulders , he says duniya ko chodo paanch kilo ka dumbbell utha ke dikhao .Tiger Zakhmi Hai . #Tiger3 pic.twitter.com/nyNahitd24
— Salman Khan (@BeingSalmanKhan) May 18, 2023