Salaar Part 2 : సలార్ పార్ట్ 2.. అంతకుమించి అట.. సీకెట్స్ రివీల్…

ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కావాలాంటే ఈజీ గా ఒక సంవత్సరంలో పడుతుంది.ఇక మొత్తంగా ఈ సినిమా రావడానికి మూడు సంవత్సరాలు పడుతుంది. అయితే ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ సాధిస్తుందో చూడాలి...

Written By: NARESH, Updated On : December 25, 2023 8:08 pm
Follow us on

Salaar Part 2 : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ తన స్థాయిని పెంచుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.ఒకప్పుడు తెలుగుకే పరిమితమైన ఆయన బాహుబలి సినిమాతో భారీ రేంజ్ లో తన సత్తా చాటుకున్నాడు. ఇక ఇప్పుడు సలార్ సినిమాతో తన రేంజ్ ఏంటో ప్రపంచం మొత్తం తెలిసేలా గర్జించాడు. ప్రభాస్ లాంటి హీరోకి ఒక మంచి కథ పడితే సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అని చెప్పడానికి సలార్ ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. ప్రస్తుతం సలార్ బాక్సాఫీస్ ని ఊచకోత కోస్తుందనే చెప్పాలి. ఇక ఈ సినిమా మీద ప్రభాస్ ఒక హాలీవుడ్ మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ప్రభాస్ సలార్ తనకు ఎంతో ఇష్టమైన స్టోరీ అని అందుకే ఆ సినిమాని చేయడానికి ఒప్పుకున్నానని చెప్పాడు.ఇక అలాగే సలార్ పార్ట్ 1 ఎంత పెద్ద సక్సెస్ అయిందో ఇక దానికి మించి సెకండ్ పార్ట్ ఉండబోతుందంటూ తన్ స్వయం గా చెప్పారు.

ఇక దీంతో ప్రభాస్ అభిమానుల్లో సలార్ 2 పై మరింత అంచనాలు పెరుగుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా మీద ఇప్పటికే చాలామంది ప్రభాస్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.ఇక ప్రభాస్ లాంటి ఒక స్టార్ కటౌట్ తో సలార్ 2 బాక్స్ ఆఫీస్ లెక్కలు మొత్తం తెలుస్తుంది అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక సలార్ పార్ట్ 1 లో పెద్దగా స్టోరీ ఏమి రిలీజ్ చేయకుండా ఖాన్సర్ ప్రాంతాన్ని ఎస్టాబ్లిష్ చేశారు కానీ సెకండ్ పార్ట్ లో మాత్రం శౌర్యంగ పర్వం రాజు అయిన ప్రభాస్ కి,మనార్ రాజు అయిన పృధ్విరాజ్ సుకుమారన్ కి మధ్య టఫ్ వార్ ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా ఎప్పుడు వస్తుంది అని ప్రేక్షకులు విపరీతంగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా రావడానికి ఇంకొక రెండు మూడు సంవత్సరాలు ఈజీగా పడుతుందని అర్థమవుతుంది.

ఎందుకంటే ఇప్పుడు ప్రభాస్ ప్రశాంత్ నీల్ ఇద్దరు కూడా వేరే వేరే ప్రాజెక్టులలో బిజీగా ఉన్నారు. కాబట్టి వీళ్ళిద్దరూ ఫ్రీ అయి మళ్ళీ ఈ సినిమా షూట్ మీదికి రావాలంటే రెండు సంవత్సరాల టైం ఈజీగా పడుతుంది. ఇక అప్పటినుంచి ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కావాలాంటే ఈజీ గా ఒక సంవత్సరంలో పడుతుంది.ఇక మొత్తంగా ఈ సినిమా రావడానికి మూడు సంవత్సరాలు పడుతుంది. అయితే ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ సాధిస్తుందో చూడాలి…