https://oktelugu.com/

Salaar Trailer: సలార్ సెకండ్ ట్రైలర్ వచ్చేస్తుంది… ఈసారి అదే హైలెట్!

ప్రభాస్ మాత్రం బయటకు రావడం లేదు. ఇదిలా ఉంటే ఇటీవల విడుదలైన సలార్ ట్రైలర్ కి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. దాంతో మరో ట్రైలర్ సిద్ధం చేశారు. నేడు ఉదయం ట్రైలర్ విడుదల కావాల్సి ఉంది. అయితే 2 గంటలకు పోస్ట్ పోన్ చేశారు.

Written By:
  • Neelambaram
  • , Updated On : December 18, 2023 / 01:22 PM IST
    Follow us on

    Salaar Trailer: సలార్ మూవీపై భారీ హైప్ ఉంది. అయినా ప్రమోషన్స్ విషయంలో జోరు చూపిస్తున్నారు. భారీ ఓపెనింగ్స్ రాబట్టాలని మేకర్స్ భావిస్తున్నారు. ప్రభాస్ నేరుగా ఎలాంటి ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొనడం లేదు. చిత్ర విడుదలకు మరో నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది. అయినా ప్రీ రిలీజ్ వేడుక డిటైల్స్ కూడా చెప్పలేదు. ప్రభాస్, రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారని తెలుస్తుంది. సలార్ చిత్రంలో నటించిన పృథ్విరాజ్, దర్శకుడు ప్రశాంత్ నీల్, నిర్మాతలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

    ప్రభాస్ మాత్రం బయటకు రావడం లేదు. ఇదిలా ఉంటే ఇటీవల విడుదలైన సలార్ ట్రైలర్ కి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. దాంతో మరో ట్రైలర్ సిద్ధం చేశారు. నేడు ఉదయం ట్రైలర్ విడుదల కావాల్సి ఉంది. అయితే 2 గంటలకు పోస్ట్ పోన్ చేశారు. సలార్ సెకండ్ ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఫస్ట్ ట్రైలర్ లో యాక్షన్ డోస్ తగ్గిందనేది అభిమానుల కంప్లైంట్. అందుకే సలార్ ట్రైలర్ 2 దుమ్మురేపే యాక్షన్ సన్నివేశాలతో కట్ చేశారని సమాచారం.

    ఫ్యాన్స్ తో పాటు యాక్షన్ మూవీ లవర్స్ కి గూస్ బంప్స్ కలిగేలా ట్రైలర్ ఉంటుందట. దాదాపు మూడు నిమిషాల ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంటుందని సమాచారం. ఇప్పటికే సలార్ మూవీని పరిశ్రమ ప్రముఖులు వీక్షించారు. మూవీ అద్భుతం అంటున్నారు. ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్. ఈసారి గురి తప్పదు అంటున్నారు. ప్రభాస్ కి బాహుబలి 2 అనంతరం క్లీన్ హిట్ లేదు. సాహో హిందీలో విజయం సాధించింది. రాధే శ్యామ్, ఆదిపురుష్ డిజాస్టర్స్ అయ్యాయి.

    సలార్ ప్రభాస్ హిట్ దాహం తీరుస్తుందని గట్టిగా నమ్ముతున్నారు. సలార్ వరల్డ్ వైడ్ రికార్డు స్థాయిలో బిజినెస్ చేసింది. తెలుగు రాష్ట్రాల వరకే సలార్ రూ. 175 కోట్లకు అమ్మారని సమాచారం. కనీసం రూ. 300 కోట్ల గ్రాస్ వస్తే కానీ బ్రేక్ ఈవెంట్ అవుతుంది. ఓవర్సీస్ తో పాటు అన్ని ఏరియాల్లో సలార్ చిత్రాన్ని భారీ ధరలు చెల్లించి కొన్నారు. డిసెంబర్ 22న సలార్ విడుదలవుతుంది. ప్రభాస్ కి జంటగా శృతి హాసన్ నటిస్తుంది.