https://oktelugu.com/

Ruhani Sharma : బ్లౌజ్ లేకుండా అలాంటి ఫోజులా… సైంధవ్ బ్యూటీ రుహని శర్మ వైల్డ్ ఫోటో షూట్ వైరల్

తాజాగా బ్లౌజ్ లేకుండా ట్రైబల్ గర్ల్ గెటప్ లో వైల్డ్ ఫోటో షూట్ చేసింది. రుహని శర్మ చాలా హాట్ గా ఉన్న ఫోటో షూట్ వైరల్ అవుతుంది.

Written By:
  • S Reddy
  • , Updated On : January 19, 2024 / 08:00 PM IST
    Follow us on

    Ruhani Sharma : ఎక్కడైనా సక్సెస్ మాత్రమే ఒకరి ఫేట్ నిర్ణయిస్తుంది. చిత్ర పరిశ్రమలో హిట్ కి ఉన్న విలువే వేరు. ఒక్క సక్సెస్ఫుల్ మూవీ దశ మార్చేస్తుంది. ఓవర్ నైట్ స్టార్ ని చేస్తుంది. ఎంత టాలెంట్ ఉన్నా అదృష్టం కూడా ఉండాలి. అన్నీ ఉన్నా ఆ లక్ లేక కెరీర్ లో రుహని శర్మ వెనుకబడిపోయింది. హిమాచల్ ప్రదేశ్ కి చెందిన రుహని శర్మ మంచి నటి అనడంలో సందేహం లేదు. చక్కని రూపం కూడా సొంతం. అయితే హిట్ చిత్రాలు లేక మరుగున పడిపోతుంది. అడపాదడపా ఆఫర్స్ తో నెట్టుకొస్తోంది.

    2017లో విడుదలైన కడైసి బెంచ్ కార్తీ అనే తమిళ చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. అనంతరం ఆమెకు తెలుగులో అవకాశం వచ్చింది. నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారి తెరకెక్కించిన చిలసౌ చిత్రంలో ఆమె హీరోయిన్ గా నటించారు. అక్కినేని హీరో సుశాంత్ హీరోగా నటించాడు. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన చిలసౌ ఫీల్ గుడ్ మూవీగా పేరు తెచ్చుకుంది. రుహని నటనకు ప్రశంసలు దక్కాయి.

    అయితే చిలసౌ కమర్షియల్ గా ఆడలేదు. చిలసౌ మూవీ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగంలో నేషనల్ అవార్డు గెలుచుకోవడం విశేషం. అయినా రుహని శర్మకు చెప్పుకోదగ్గ ఆఫర్స్ రాలేదు. దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన హిట్ మూవీలో హీరోయిన్ గా నటించింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ లో రుహని శర్మ పాత్రకు పెద్దగా స్కోప్ ఉండదు. చెప్పాలంటే రుహని శర్మ కెరీర్ గ్రాఫ్ పడిపోతూ వస్తుంది.

    హిట్ మూవీ దర్శకుడు శైలేష్ కొలను మరోసారి ఆమెకు ఆఫర్ ఇచ్చాడు. సంక్రాంతి రిలీజ్ సైంధవ్ లో ఓ రోల్ ఇచ్చాడు. అనూహ్యంగా సైంధవ్ పరాజయం పాలైంది. సంక్రాంతి చిత్రాల్లో అతి తక్కువ వసూళ్లు తెచ్చుకున్న మూవీగా నిలిచింది. మరోవైపు రుహని శర్మ వెబ్ సిరీస్లు కూడా చేస్తుంది. హీరోయిన్ గా బ్రేక్ కోసం ఎదురుచూస్తుంది. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా గ్లామర్ ట్రీట్ ఇస్తుంది. తాజాగా బ్లౌజ్ లేకుండా ట్రైబల్ గర్ల్ గెటప్ లో వైల్డ్ ఫోటో షూట్ చేసింది. రుహని శర్మ చాలా హాట్ గా ఉన్న ఫోటో షూట్ వైరల్ అవుతుంది.