https://oktelugu.com/

Sai Pallavi Marriage: రహస్య వివాహం చేసుకున్న సాయి పల్లవి… డైరెక్టర్ పోస్ట్ తో వెల్లడైన నిజం!

సాయి పల్లవికి పెళ్లి జరిగందని వైరల్ అవుతున్న ఫోటో మీద దర్శకుడు వేణు ఉడుగుల స్పందించారు. ఇదంతా ఫేక్ ప్రచారం అని స్పష్టత ఇచ్చాడు. ఆ ఫోటో ఓ సినిమా పూజా కార్యక్రమానికి సంబంధించింది.

Written By: , Updated On : September 21, 2023 / 10:18 AM IST
Sai Pallavi Marriage

Sai Pallavi Marriage

Follow us on

Sai Pallavi Marriage: సాయి పల్లవి పెళ్లి ఎవర్ గ్రీన్ హాట్ టాపిక్. దాదాపు రెండేళ్లు సాయి పల్లవి యాక్టివ్ గా లేరు. ఆమె తెలుగుతో పాటు తమిళ్ కూడా చిత్రాలకు సైన్ చేయలేదు. విరాటపర్వం ఆమె చివరి చిత్రం. తమిళంలో గార్గి టైటిల్ తో లేడీ ఓరియెంటెడ్ చిత్రం చేసింది. సాయి పల్లవి సైలెంట్ కావడంతో పలు రూమర్స్ తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా ఆమె వివాహం చేసుకోబోతున్నారని కథనాలు వెలువడ్డాయి. పెద్దలు పెళ్లి కుదిర్చిన నేపథ్యంలో సాయి పల్లవి నటనకు గుడ్ బై చెప్పింది. అందుకే కొత్త ప్రాజెక్ట్స్ ఒప్పుకోవడం లేదంటూ వార్తలు వినిపించాయి.

తాజాగా సాయి పల్లవి పెళ్లి ఫోటో సోషల్ మీడియాలో సంచలనం రేపింది. మెడలో పూల దండలతో ఓ వ్యక్తి పక్కన ఆమె నిల్చొని ఉన్నారు. ఈ ఫోటో విపరీతంగా వైరల్ అయ్యింది. సాయి పల్లవి ఎవరికీ తెలియకుండా రహస్య వివాహం చేసుకున్నారంటూ సోషల్ మీడియా కోడై కూసింది. మీడియాలో కథనాలు కూడా వెలువడ్డాయి. ఈ న్యూస్ ఆమె అభిమానులను విస్మయానికి గురి చేసింది. ఇక ఈ నేచురల్ బ్యూటీని సిల్వర్ స్క్రీన్ పై మిస్ అవుతామంటూ తెగ బాధపడిపోయారు.

సాయి పల్లవికి పెళ్లి జరిగందని వైరల్ అవుతున్న ఫోటో మీద దర్శకుడు వేణు ఉడుగుల స్పందించారు. ఇదంతా ఫేక్ ప్రచారం అని స్పష్టత ఇచ్చాడు. ఆ ఫోటో ఓ సినిమా పూజా కార్యక్రమానికి సంబంధించింది. హీరో శివ కార్తికేయకు జంటగా సాయి పల్లవి తమిళ చిత్రం చేస్తున్నారు. ఆ మూవీ పూజా కార్యక్రమం రోజున తీసిన ఫోటోను కట్ చేసి పెళ్లి ఫోటోగా వైరల్ చేస్తున్నారని ఆయన క్లారిటీ ఇచ్చాడు. దాంతో సాయి పల్లవి పెళ్లి వార్తలకు బ్రేక్ పడింది. ఫ్యాన్స్ కూడా ఊపిరి పీల్చుకున్నారు.

సాయి పల్లవి భిన్నమైన భావాలు ఉన్న అమ్మాయి. పెళ్లి పై తనకంత ఆసక్తి లేదని గతంలో చెప్పడం విశేషం. ఇక సాయి పల్లవి కెరీర్ పరిశీలిస్తే… తెలుగులో భారీ ప్రాజెక్ట్ కి సైన్ చేశారు. కార్తికేయ 2 ఫేమ్ చందూ మొండేటి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. నాగ చైతన్య హీరో. దాదాపు రూ. 80 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కనుందని సమాచారం. ఈ పాన్ ఇండియా చిత్రానికి తండేల్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారట.

యధార్థ సంఘటనల ఆధారంగా ఓ ఎమోషనల్ లవ్ స్టోరీగా ఇది తెరకెక్కుతుంది. నాగ చైతన్య బోటు నడిపేవాడిగా కనిపిస్తాడట. అలాగే సాయి పల్లవి హిందీలో ఓ మూవీ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అధికారిక సమాచారం అందాల్సి ఉంది. హీరో ఎవరైనా పాత్రకు ప్రాధాన్యత లేకపోతే సాయి పల్లవి మూవీ చేయరు.