Sai Pallavi: సాయి పల్లవి చాలా ఫిట్ గా ఉంటుంది. అందాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ శారీరక శ్రమ చెయ్యాలి. కానీ.. సాయి పల్లవి అందం కోసం శారీరక శ్రమ చేయదు అట. ఆరోగ్యం కోసం మాత్రమే తాను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాను అని చెబుతుంది. ఆరోగ్యం బాగుంటే.. అందం కూడా పెరుగుతుంది అని.. ఇదే సూత్రాన్ని తాను పాటిస్తాను అంటూ సాయి పల్లవి చెబుతుంది.

ఇంకా సాయి పల్లవి మాట్లాడుతూ..“ప్రతిరోజూ ఎక్సర్ సైజ్ చెయ్యాల్సిన అవసరం నాకు లేదు. కానీ క్రమం తప్పకుండా నేను ఏదో రకంగా శారీరక శ్రమ చేస్తాను. ఎప్పుడైనా కన్సిస్టెన్సీ ముఖ్యం. ఒక విధంగా అదే నా ఫిజిక్ సీక్రెట్. తప్పని పరిస్థితుల్లో తప్ప నేను ఎక్కువగా కృతిమ ఎక్సర్ సైజ్ లు చేయను అని చెప్పింది ఈ భామ.
ఈ అమ్మడు గతంలో వర్కవుట్ ల విషయంలో ఎప్పుడూ పెద్దగా సీరియస్ గా లేదు అట. కానీ, సినిమా ఇండస్ట్రీలో ఇతర నటీనటుల శ్రమపడే విధానాన్ని చూసి సాయి పల్లవి తన బాడీ పై ఫోకస్ పెట్టిందట. అయితే, ఏమి చేసినా సహజంగానే చేయాలని ఆమె ముందే ఒక నియమం పెట్టుకుందట.
మధ్యలో జిమ్మింగ్ ను కూడా సాయి పల్లవి బాగా అలవాటు చేసుకుంది. అయితే జిమ్మింగ్ ఎక్కువగా అలవాటు అయితే వదలం అని.. అందుకే.. అప్పటి నుంచి ఎక్కువ సేపు జిమ్ లో ఉండటం లేదు అని సాయిపల్లవి చెప్పుకొచ్చింది. ఇక సాయి పల్లవి ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని.. ఆమె రైతుగా మారి.. కూలీలతో కలిసి పనులు చేసిన సంగతి తెలిసిందే.
ఈ ఫోటోలను సాయిపల్లవి తన ఇన్ స్టా లో అభిమానులతో పంచుకుంది. ఈ ఫోటోల్లో సాయి పల్లవి మరింత ముద్దుగా కనిపించడంతో.. విపరీతంగా వైరల్‌గా మారాయి. మరి సాయి పల్లవి చెప్పిన శారీరక శ్రమ అంటే ఇదేనేమో. అసలు హీరోయిన్లు అందరూ తమ హాట్ హాట్ గ్లామర్ ఫోటోలతో సోషల్ మీడియాని షేక్ చేస్తుంటే.. సాయి పల్లవి మాత్రం ఇలా కొత్తగా ఆకట్టుకుంటుంది.