Sai Pallavi: ‘సాయి పల్లవి’ సినీ కెరీర్ కొత్త హీరోయిన్లకు ఓ ప్రేరణ. మొదట్లో హీరోయిన్ గా పనికిరాదు అన్నారు. ఎలాగోలా కష్టపడి హీరోయిన్ అయ్యాక.. ‘అరె.. ఈమె హీరోయిన్ ఏమిటి ? అంటూ విమర్శలు చేశారు. కాలం ఎప్పటిలాగే ముందుకు కదిలింది. ఎవరూ ఊహించని విధంగా మూడు భాషల్లో సాయి పల్లవి స్టార్ హీరోయిన్ అయిపోయింది. స్టార్ అయ్యాక, సింపుల్ క్యారెక్టర్స్ లో ఏ హీరోయిన్ నటించడానికి ఇష్టపడదు.

కానీ, సాయి పల్లవి సహజ పాత్రలతోనే ఉర్రూతలూగించింది. వెండితెర పై వెలిగిపోతున్న సమయంలో చిన్న హీరోయిన్ కూడా డిజిటల్ తెర పై ఆడి పాడడానికి ఆసక్తి చూపించదు. కానీ, సాయి పల్లవి వెబ్ సిరీసుల్లోనూ తన సత్తా సగర్వంగా చాటి చెప్పబోతుంది. ఇప్పుడు టీవీ రంగంలోనూ కాలుమోపబోతుంది.
Also Read: Venu Sriram – Dil Raju: వారిద్దరి బంధం చెడింది.. బన్నీనే విడగొట్టాడు !
‘మా టీవీ’లో ఆమె నిర్మాణంలో ఓ టీవీ షో స్టార్ట్ కాబోతుంది. నిజానికి ఈ నేచురల్ బ్యూటీ కెరీర్ టెలివిజన్ డాన్స్ రియాలిటీ షోలతోనే ప్రారంభమైంది. ఆ తర్వాత సపోర్టింగ్ రోల్స్ చేస్తూ హీరోయిన్ గా మారింది. మలయాళ చిత్రం ప్రేమమ్ సాయి పల్లవిని హీరోయిన్ గా నిలబెట్టింది. తెలుగులో ఫిదా చిత్రంతో సాయి పల్లవి స్టార్ అయ్యింది.
ఎంత ఎదిగినా, ఎంత గ్లామర్ ప్రపంచంలో బ్రతుకుతున్నా తన మూలాలు మర్చిపోలేదు సాయి పల్లవి. అందుకే.. తను ఏ బుల్లితెర పై అయితే ఎదిగిందో.. ఇప్పుడు అదే తెరకు నిర్మాత అవతారంలో తన సపోర్ట్ ను అందిస్తోంది. ఆమె నిర్మించే టీవీ షో గురించి త్వరలోనే అప్ డేట్ రానుంది. వెండితెర పైనే కాదు రియల్ లైఫ్ లో కూడా సాయి పల్లవి పద్దతికి మారుపేరు. ఆమె సింప్లిసిటీకి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.

అంత సహజంగా ఉంటుంది ఆమె. సినిమాకి కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నా.. ఇప్పటికీ సాధారణ మధ్యతరగతి కుటుంబ జీవనశైలిని పాటిస్తూ ఉండటం.. బహుశా ఈ జనరేషన్ లో ఒక్క సాయి పల్లవికే సాధ్యం అయింది అనుకుంటా. ఇక సాయి పల్లవి తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది.
ఈ సందర్భంగా సాయి పల్లవి తన ఆలోచనలను ప్రేక్షకులతో పంచుకుంది. ‘నేను హీరోయిన్ గా ఎదిగింది సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ వల్లే. అయితే, నేను సౌత్ భాషలన్నింటిలోనూ సినిమాలు చేసినా.. నాకు అంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చింది మాత్రం టాలీవుడే. అందుకే నాకు తెలుగు అంటే ఇష్టం. ప్రపంచమంతా నన్ను తెలుగు అమ్మాయిగానే గుర్తించడానికి కారణం కూడా అదే అయి ఉంటుంది.
పైగా తెలుగు తనం మా ఇంట్లో కూడా ఆనవాయితీ అయిపోయింది. ఇప్పుడు మా ఇంట్లో తెలుగు వంటలు కూడా రెగ్యులర్ గా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రెండు ఐటమ్స్ పూత రేకులు, ఆవకాయ అంటే మా ఫ్యామిలీకి బాగా ఇష్టం’ అని సాయి పల్లవి చెప్పుకొచ్చింది.
Also Read:Bigg Boss Akhil And Bindu Madhavi: అఖిల్ కోసం ‘చేయి కోసుకుంటా’.. అందరికీ షాకిచ్చిన బిందుమాధవి
[…] Also Read: Sai Pallavi: ఆ రెండు బాగా ఇష్టం అంటున్న ‘సాయి … […]