Homeఎంటర్టైన్మెంట్Sai Pallavi: సినిమాలకు దూరం కానున్న సాయి పల్లవి?? ఫాన్స్ కి ఊహించని షాక్

Sai Pallavi: సినిమాలకు దూరం కానున్న సాయి పల్లవి?? ఫాన్స్ కి ఊహించని షాక్

Sai Pallavi: మన టాలీవుడ్ లో అందం తో కాకుండా టాలెంట్ తో కెరీర్ ని నెట్టుకొచ్చే హీరోయిన్స్ చాలా తక్కువ..అలాంటి హీరోయిన్స్ లో ఒకరే సాయి పల్లవి..ఈటీవీ లో ప్రసారమయ్యే ఢీ అనే డాన్స్ షో ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ టాలెంటెడ్ హీరోయిన్ మలయాళం లో ప్రేమమ్ అనే సినిమా ద్వారా సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది..తొలి సినిమాతోనే భారీ సెన్సషనల్ హిట్ అందుకున్న సాయి పల్లవి కి సౌత్ లో అన్ని ఇండస్ట్రీల నుండి అవకాశాల వెల్లువ కురుస్తుంది..తెలుగు లో ఈమె వరుణ్ తేజ్ హీరో గా నటించిన ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చింది..ఈ సినిమా అప్పట్లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికి తెలిసిందే..ఈ సినిమాలో హీరోకంటే హీరోయిన్ కి ఎక్కువ క్రేజ్ రావడం విశేషం..తన అందం మరియు అభినయం తో కుర్రకారుల మతిని పోగొట్టి అద్భుతమైన క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది..ఇక ఈమె డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..సాయి పల్లవి తో డాన్స్ చెయ్యడం అంటే హీరోలకు పెద్ద సవాల్ అనే చెప్పాలి..లేడీ పవర్ స్టార్ గా అశేష ప్రేక్షకాదరణ పొందిన ఈమె ఇప్పుడు అతి త్వరలోనే సినిమాలు మానేయబోతుంది అనే వార్త ఆమె అభిమానులను తీవ్రమైన నిరాశకి గురి చేస్తోంది.

Sai Pallavi
Sai Pallavi

మన టాలీవుడ్ మాత్రమే కాదు..ఏ ఇండస్ట్రీలోనైనా ఒక హీరోయిన్ ఎక్కువకాలం పాటు ఇండస్ట్రీ లో కొనసాగాలంటే కచ్చితంగా అందం మరియు టాలెంట్ తో పాటు సక్సెస్ రేట్ కూడా బాగా ఉండాలి..సక్సెస్ రేట్ లేకపోతే ఎప్పటికైనా కష్టమే..సాగినన్ని రోజులు మంచిగానే కెరీర్ సాగుతుంది కానీ..రెండు డిజాస్టర్లు పడితే ఆ హీరోయిన్ తో సినిమాలు చెయ్యడానికి నిర్మాతలు ఆలోచిస్తారు..ఇప్పుడు సాయి పల్లవి విషయం లో కూడా అదే జరుగుతుంది..ఈమె ఇప్పటి వరుకు టాలీవుడ్ లో నటించిన సినిమాలలో ఎక్కువ శాతం విజయం సాధించిన సినిమాలే ఉన్నాయి..అయితే ఇటీవల ఈమె నుండి విడుదలైన విరాటపర్వం మరియు గార్గి వంటి సినిమాలు మంచి పాజిటివ్ రివ్యూస్ వచ్చినప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి.

Also Read: Anasuya Bharadwaj: ‘సరసాలు చాలు’ అంటూ అనసూయ విరహ గానం.. తట్టుకోవడం కష్టమే?

Sai Pallavi
Sai Pallavi

దీనితో సాయి పల్లవి తో కొంతమంది దర్శక నిర్మాతలు ఎప్పుడూ నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలే కాదు..కెరీర్ కొనసాగాలంటే గ్లామర్ షో చెయ్యడం..నటన కి పెద్దగా ప్రాధాన్యం లేకపోయినా స్టార్ హీరోల సినిమాలలో అవకాశం వస్తే ఆలోచించకుండా ఒప్పుకొని చెయ్యడం వంటివి చెయ్యాలి అని సాయి పల్లవి కి సలహా ఇవ్వడం తో అవసరం అయితే సినిమాలు మానేయడానికి సిద్ధం కానీ..మనసుకి నచ్చని అలాంటి పాత్రలు చెయ్యను అంటూ మొహం మీదనే చెప్పిందట..దీనితో ఫ్లాప్స్ లో ఉన్న సాయి పల్లవి తో ఆమె ఎంచుకున్న దారిలో సినిమాలు చెయ్యడానికి దర్శక నిర్మాతలు ముందుకి వస్తారా లేదా అనేది ఇప్పుడు ప్రశ్న.

Also Read:Anupam kher- Ravi Teja: రవితేజ సినిమా కోసం జాతీయ అవార్డు గ్రహీత.. ఈసారైనా హిట్ కొడుతాడా?

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version