Sai Pallavi Gargi Movie: విలక్షణమైన కథలతో ఎప్పుడు మన ముందుకు వచ్చే సాయి పల్లవి ఈసారి ‘గార్గి’ అనే సినిమా ద్వారా మన ముందుకి వచ్చిన సంగతి తెలిసిందే..ఈ సినిమాకి ముందు ఆమె నటించిన ‘విరాట పర్వం’ సినిమా విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..ముఖ్యంగా ఈ చిత్రం లో సాయి పల్లవి నటనకి మంచి మార్కులు పడ్డాయి..హీరో రానా కంటే కూడా సాయి పల్లవికి మంచి పేరు రావడం విశేషం..ఆమె నటించిన లేటెస్ట్ చిత్రం ‘గార్గి’ కి కూడా అదే స్థాయి రెస్పాన్స్ వచ్చింది..జులై 15 వ తారీఖున తెలుగు , తమిళం మరియు మలయాళం బాషలలో విడుదలైన ఈ సినిమాకి అద్భుతమైన రివ్యూస్ వచ్చినప్పటికీ కూడా ఎందుకు కమర్షియల్ పరంగా ఆశించిన స్థాయి వసూళ్లను రాబట్టలేకపోయింది..ఈ చిత్రం తెలుగు వెర్షన్ ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా 3 కోట్ల రూపాయలకు జరిగింది..పది రోజులు కూడా గడవకముందే అప్పుడే క్లోసింగ్ కి పడిపోయింది..ఫుల్ రన్ లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఎంత వసూళ్లను రాబట్టిందో ఇప్పుడు మనం చూడబోతున్నాము.

మాములుగా కొత్త రకం సినిమాలు నైజం ప్రాంతం లో అద్భుతంగా ఆడుతాయి..కానీ గార్గి సినిమా కొత్త రకం స్టోరీ అయినప్పటికీ కూడా నైజం ప్రాంతం లో మొదటి రోజు నుండే ఆశించిన స్థాయి లో వసూళ్లను రాబట్టలేకపోయింది..ఈ చిత్రం ఇక్కడ ఫుల్ లో కేవలం 33 లక్షల రూపాయిల షేర్ ని మాత్రమే రాబట్టింది..ఇక రాయలసీమ ప్రాంతం సంగతి చెప్పక్కర్లేదు..అక్కడి ఆడియన్స్ ఇలాంటి సినిమాలను పెద్దగా ఆదరించారు..ఈ ప్రాంతం లో ఇక్కడ ఫుల్ రన్ లో కేవలం 17 లక్షల రూపాయిల షేర్ ని మాత్రమే రాబట్టింది..ఇక ఉత్తరాంధ్ర ప్రాంతం లో 18 లక్షల రూపాయిలు వసూలు చేసిన ఈ సినిమా, నెల్లూరు లో 3 లక్షల రూపాయిలు..ఈస్ట్ లో 5 లక్షల రూపాయిలు మరియు వెస్ట్ లో 5 లక్షల రూపాయిలను వసూలు చేసింది.
Also Read: DJ Tillu Sequel: DJ టిల్లు సీక్వెల్ కి ఊహించని షాక్.. రంగం లోకి దిగిన మరో డైరెక్టర్

అలాగే కృష్ణ జిల్లాలో 8 లక్షల రూపాయిల షేర్ ని వసూలు చేసిన ఈ చిత్రం , గుంటూరు జిల్లాలో 6 లక్షల రూపాయిలు మాత్రమే వసూలు చేసింది..మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ సినిమా కేవలం 95 లక్షల రూపాయిల షేర్ ని మాత్రమే వసూలు చేసింది..ఇక ఓవర్సీస్ మరియు కర్ణాటక ప్రాంతాలు కూడా కలిపితే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఒక కోటి 5 లక్షల రూపాయిలను వసూలు చేసి 2 కోట్ల రూపాయిలు నష్టాలను మిగిలించి కమర్షియల్ ఫెయిల్యూర్ గా నిలిచింది..తెలుగు లో ఈ సినిమాని సురేష్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పించగా..తమిళ్ లో ప్రముఖ హీరో సూర్య ఈ చిత్రాన్ని సమర్పించారు.
Also Read:Megastar Chiranjeevi: చిరంజీవికి కోపమొచ్చింది.. డైరెక్టర్లకు చురకలు