Sai Dharam Tej: సోషల్ మీడియా లో గత రెండు రోజుల నుండి సాయి ధరమ్ తేజ్ వేసిన ఒక పోస్టు వల్ల జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ఫ్యాన్స్ మధ్య ఘోరమైన ఫ్యాన్ వార్స్ జరుగుతున్నాయి..ఇక అసలు విషయానికి వస్తే సాయి ధరమ్ తేజ్ హీరో గా నటించబోతున్న కొత్త సినిమాకి సంబంధించిన టైటిల్ గ్లిమ్స్ వీడియో కి జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించాడు..ఈ టైటిల్ వీడియో గ్లిమ్స్ ని ఈరోజు విడుదల చేసారు..ఈ సినిమాకి టైటిల్ గా ‘విరూపాక్ష’ అని పెట్టారు.

సోషల్ మీడియా లో ఈ టైటిల్ గ్లిమ్స్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది..ఇక్కడ వరుకు అంత బాగానే ఉంది కదా..ఇందులో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ఫ్యాన్స్ కొట్టుకోవాల్సిన అవసరం ఏముంది అని మీరు అనుకోవచ్చు..కానీ ఇక్కడే అసలు విషయం ఉంది..సాయి ధరమ్ తేజ్ తన ఫేస్ బుక్ అకౌంట్ లో ఈ వీడియో గ్లిమ్స్ విడుదలకు ముందు ‘మ్యాన్ ఆఫ్ ది మాస్సెస్ ఎన్టీఆర్ మా సినిమా టైటిల్ గ్లిమ్స్ వీడియో కి వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నాడు..థాంక్స్ తారక్’ అంటూ సాయి ధరమ్ తేజ్ ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ పెట్టాడు.
సోషల్ మీడియా లో చాలా కాలం నుండి ‘మ్యాన్ ఆఫ్ ది మాసెస్’ టాగ్ కోసం ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ఫ్యాన్స్ మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది..ఎవరైనా ఆ ట్యాగ్ వేరే హీరో కి ఉపయోగిస్తే రామ్ చరణ్ ఫ్యాన్స్ కి కోపం కట్టలు తెచ్చుకుంటుంది..నిన్న వాళ్ళ క్రోధాగ్నికి పాపం సాయి ధరమ్ తేజ్ బలైపోయాడు..ట్విట్టర్ సాయి ధరమ్ తేజ్ ని ట్యాగ్ చేస్తూ మా హీరో బిరుదు ని ఎన్టీఆర్ కి వాడుతావా అంటూ చాలా నీచంగా అతనిని తిట్టడం ప్రారంభిస్తారు..అప్పుడు ఒక అభిమాని ట్వీట్ క్రింద రామ్ చరణ్ పీఆర్వో శివ చెర్రీ కామెంట్ చేస్తూ ‘చెక్ DM ‘ అని కామెంట్ చేస్తాడు.

దానిని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తూ ‘చెక్ DM ‘ ట్యాగ్ తో నేషనల్ వైడ్ ట్రెండ్ చేస్తారు..అది చూసి రామ్ చరణ్ ఫ్యాన్స్ గతం లో ఎన్టీఆర్ పీఆర్వో ఒక అభిమాని ట్వీట్ క్రింద ‘ఓపెన్ DM ‘ అని కామెంట్ చెయ్యడం గమనించి వాళ్ళు కూడా ఆ ట్యాగ్ మీద నేషనల్ వైడ్ ట్రెండ్ చేస్తారు..అలా ఇద్దరి హీరోల అభిమానుల మధ్య సోషల్ మీడియా లో ఈ వార్ నడుస్తూనే ఉంది.