కరోనా కల్లోలం తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రత్యేక సడలింపులతో థియేటర్ లలో సినిమాలని విడుదల చేసుకోవచ్చని ఆదేశాల జారీ చేసినప్పటికి, దర్శక నిర్మాతలు,హీరోలు ధైర్యం చేసి సినిమాలు రిలీజ్ చెయ్యటానికి భయపడి వెనకడుగు వేస్తున్న సమయంలో మెగా ఫ్యామిలీ నుండి సోలోగా వచ్చాడు ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాతో సాయి ధరమ్ తేజ్. కరోనా కాటు ఇంకా తగ్గకపోయినా, కేవలం 50 పర్సెంట్ ఆక్యుపెన్సీ నిబంధనలు ఉన్నప్పటికీ ఈ యువ హీరో ధైర్యంతో సినిమా రిలీజ్ చేస్తున్నామంటూ ప్రకటించాడు. అంతా అనుకూలంగా ఉన్న టైం లోనే సినిమా ఫలితం ఏమవుతుందో అనే టెన్షన్ మొత్తం సినిమా ప్రపంచాన్ని ఒత్తిడికి గురి చేస్తుంది. కానీ ఇలాంటి ప్రతికూల సమయంలో మెగా హీరో తీసుకున్న నిర్ణయం సినిమా ఇండస్ట్రీ వారికి షాక్ ఇచ్చింది.
Also Read: దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుల ప్రకటన.. టాలీవుడ్ లో వీరికే
పద్మ వ్యూహంలోకి వెళుతున్న తేజ్ విజేతగా వస్తాడా? మన అందరికి దారి చూపిస్తాడా? అని తెలుగు సినిమా ప్రపంచం కళ్లప్పగించి చూసింది. అందరిలో ఉన్న సందేహాలకు సమాధానమివ్వటానికి, క్రిస్మస్ పండుగ కానుకగా ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా డిసెంబర్ 25న రెండు రాష్ట్రాలలో గ్రాండ్ గా విడుదలయింది. మెగా హీరో తనదైన శైలిలో వినోదం పంచి అభిమానులని అలరించి విజయవంతంగా యుద్ధంలో గెలుపొందాడు. ఈ మూవీ మంచి కలెక్షన్స్ తో తోలివారం ముగిసే లోగా బ్రేక్ ఈవెన్ కు వచ్చేసింది. నూతన సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి లాభాల బాటలో పయనిస్తోందని ట్రేడ్ వర్గాల నుండి సమాచారం.
Also Read: అభిజీత్ నిర్ణయానికి సినీ పెద్దలే ఆశ్చర్యపోతున్నారట !
ఈ కొత్త సంవత్సరాన్ని తెలుగు సినిమా పరిశ్రమ మంచి విజయంతో ఆరంభించింది. మొదట్లో కొంచెం కలెక్షన్స్ వీక్ గా ఉన్నప్పటికీ పాజిటివ్ టాక్ తో ప్రేక్షకులని ఆకర్షించి రోజు రోజుకి వసూళ్లు పెరుగుతూ స్థిరంగా కొనసాగింది. ఈ ప్రదర్శనతో మొదటి వారంలోనే బ్రేక్-ఈవెన్ సాధించడానికి అవసరమైన వసూళ్లు సంపాదించింది. ఈ రెండో వారంలో కూడా అదే హవాని కొనసాగిస్తూ దూసుకుపోతున్నాడు మెగా హీరో. నెక్స్ట్ వీకెండ్ లో క్రౌడ్ మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ విజయాన్ని సినీ పరిశ్రమ అంతా సెలెబ్రేట్ చేసుకుంటుంది. తేజ్ ని అనుసరిస్తూ మరికొద్ది రోజుల్లో సంక్రాంతి సీజన్ కి నాలుగైదు సినిమాలు విడుదలకి సిద్దమవుతున్న తరుణంలో రాబోయే వారం ఈ సినిమాకి కీలకంగా మారనుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Sai dharam tej cracking the corona strategy
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com