spot_img
Homeఎంటర్టైన్మెంట్Sai Dharam Tej: పేరు మార్చుకున్న సాయి ధరమ్ తేజ్... కొత్త పేరు ఏంటో తెలుసా?

Sai Dharam Tej: పేరు మార్చుకున్న సాయి ధరమ్ తేజ్… కొత్త పేరు ఏంటో తెలుసా?

Sai Dharam Tej: న్యూమరాలజీ, జాతకాలు నమ్మేవాళ్ళు పరిశ్రమలో చాలా మందే ఉన్నారు. పేరులో అక్షరాల సంఖ్య, మొదటి అక్షరం జీవితాలను ప్రభావితం చేస్తాయని, సక్సెస్ తెచ్చిపెడతాయని భావిస్తారు. గతంలో పలువురు హీరోలు, హీరోయిన్స్ తమ పేర్లను మార్చుకోవడం జరిగింది. ఈ లిస్ట్ లో సాయి ధరమ్ కూడా ఉన్నాడు. గతంలో ఒకసారి పేరు మార్చుకున్న సాయి ధరమ్ తేజ్… మరోసారి ఆ పని చేశారు. సాయి ధరమ్ తేజ్ ఓ ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తన పేరు సాయి దుర్గ తేజ్ అని చెప్పాడు.

సర్ నేమ్ కారణంగా నా పేరులో ఎటూ నాన్న పేరు ఉంది. దుర్గ అని జతజేయడం ద్వారా అమ్మ కూడా నాతో ఉన్నట్లు అవుతుంది. అందుకే సాయి ధరమ్ తేజ్ కాస్తా సాయి దుర్గ తేజ్(Sai Durga Tej) అని మార్చానని ఆయన వివరణ ఇచ్చాడు. కాగా సాయి ధరమ్ తేజ్ బైక్ ప్రమాదానికి గురయ్యాడు. దాదాపు ఏడాది పాటు సిల్వర్ స్క్రీన్ కి దూరం అయ్యాడు. కోలుకున్నాక విరూపాక్ష చిత్రం చేశాడు. ఇది భారీ విజయం సాధించింది. మంచి లాభాలు పంచింది.

అనంతరం మేనమామ పవన్ కళ్యాణ్ తో బ్రో మూవీ చేశాడు. వినోదయసితం ఆధారంగా తెరకెక్కిన బ్రో ఓ మోస్తరు ఫలితం అందుకుంది. సముద్ర ఖని ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. మాటలు, స్క్రీన్ ప్లే త్రివిక్రమ్ అందించాడు. ప్రస్తుతం గంజా శంకర్ టైటిల్ తో ఒక చిత్రం చేస్తున్నాడు. సంపత్ నంది ఈ చిత్ర దర్శకుడు. కాగా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ వార్తలు రాగా ఇదే వేదికపై సాయి ధరమ్ తేజ్ స్పందించారు.

గంజా శంకర్ ఆగిపోయిన విషయం నాకు కూడా తెలియదు. ఓ వెబ్ సైట్ లో వచ్చిన వార్త చదివాకా నాకు తెలిసొచ్చింది. నాకు తెలియని విషయాలు కూడా కొన్ని వెబ్స్ సైట్స్ రాస్తూ ఉంటాయి. వాళ్ళ ద్వారా నేను తెలుసుకుంటా అని ఆయన సెటైర్స్ వేశాడు. గంజా శంకర్ ఆగిపోయిందని వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని పరోక్షంగా హింట్ ఇచ్చాడు. సంపత్ నంది హీరోయిన్ తమన్నాతో ఓదెల 2 ప్రకటించారు. దాంతో గంజా శంకర్ ఆగిపోయిందని పుకార్లు లేచాయి.

RELATED ARTICLES

Most Popular