Homeఎంటర్టైన్మెంట్Pushpa Song: ఇది పుష్ప పాట అంటూ పుకార్లు.. నిజమేనా ?

Pushpa Song: ఇది పుష్ప పాట అంటూ పుకార్లు.. నిజమేనా ?

Pushpa Song: పుష్ప సినిమాలో ఒక సాంగ్ ఉంది. లిరికల్ రైటర్ శ్రీమణి రాసిన పాట అది. అయితే, కొన్ని కారణాల కారణంగా ఆ పాటను సినిమాలో పెట్టలేదు. ఇప్పుడు ఆ పాటలోని కొన్ని లైన్లు సోషల్ మీడియాలో ముఖ్యంగా సినిమా గ్రూప్స్ లో బాగా హల్ చల్ చేస్తున్నాయి. మరి మీరు కూడా ఆ పాటలోని లైన్ల పై ఓ లుక్కేయండి.

Pushpa Song
Pushpa Song

చల చల్లని చలి తెమ్మెరలు తనువును తాకుతుంటే..
చల్లని హిమబిందువులు సాలె గూడును అల్లుతుంటే..
చకోర సంకీర్తనలు శ్రావణానందంగా వినిపిస్తుంటే
చలిపులి కోరలు విప్పి నను తరిమేస్తుంటే
చలిమంట కాపుకోసం నే సమిధనౌతుంటే
చెలికోసం నే సిరిమల్లెలు తెంపుతుంటే
చక్కని చందమామ నా అవస్థలు చూస్తుంటే
చతుర్ముఖ తారా కాంతులు వెదజల్లు తుంటే
చందన సుగంధభరితపరిమళాలు ఘుప్పుమంటే
చామంతుల ఛాయలోనా హృది తూగుతుంటే
చెలి ననుకోరి కొత్త వలపులు రువ్వుతుంటే
చరణ కంకణములు ఘల్లు ఘల్లు మంటుంటే
చంచల నా మది నిర్లిప్తావస్థలోకి జారుతుంటే
చంపక మాలలా అధర ధ్వనిలో నే జోగుతుంటే
చెప్పలేని ఏదో ఓ హాయి నను చేరి కవ్విస్తుంటే
చేయీ చేయీ కలిపినట్లునా కల సాకారమౌతుంటే
చలి తెమ్మెర తరంగ తరంగాలలో నేపులకిస్తుంటే
చక్కిలిగింతల నా తనువు తేలి తేలి పోతుంటే
చలువరాతి కలల సౌధంలో నే పరవశించనా
చల్లనిచలితెమ్మెరలకు సుస్వాగతాభినందనలు తెలుపనా…!!

Also Read: పుష్పలో సమంత ఐటెమ్ సాంగ్ పాడింది ఎవరో తెలుసా?

మొత్తమ్మీద ఈ పాట ఇలా సాగింది. మరి నిజంగానే ఈ పాట పుష్ప సినిమాలోనిదేనా ? లేక, ఎక్కడో లిరిక్స్ ను పుష్ప పాట అంటూ లేనిపోని పుకార్లకు నాంది పలికారా ? అనేది తెలియాల్సి ఉంది.

ఉన్న స్థాయి నుంచి పై స్థాయికి ఎదగాలని, పాన్ ఇండియా స్టార్ గా మారాలని బన్నీ గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. కాకపోతే, పాన్ ఇండియా స్టార్ అవ్వడం అంటే అంత తేలికేం కాదు కదా. అసలు పాన్ ఇండియా స్థాయి గుర్తింపు రావాలంటే ఎన్నో కలిసి రావాలి. మరి బన్నీ కి అన్నీ కలిసి వస్తాయా ? చూడాలి.

Also Read: సామ్​తో ‘పుష్ప’ ఐటెం సాంగ్​ షూటింగ్​ అప్పుడేనా?

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version