Ruhani Sharma: హీరోయిన్లకు పెద్దగా టైమ్ దొరకదు. దొరికినా వాళ్ళు ఖర్చు పెట్టి విహారయాత్రలు చేయడానికి పెద్దగా ఇష్టపడరు. కారణం.. హీరోయిన్ అనగానే వాళ్లకు అనేక వెకేషన్ ఆఫర్లు వస్తుంటాయి. సో.. ఆ ఆఫర్లను వాళ్ళు అందిపుచ్చుకుని ముందుకు పోతుంటారు. ఈ క్రమంలోనే హీరోయిన్లకు మాల్దీవులకు వెళ్లడం ఆనవాయితీ అయిపోయింది.

టైం దొరికితే చాలు ఈ మధ్య ప్రతి హీరోయిన్ మాల్దీవుల్లో వెకేషన్ కి వెళ్ళిపోతుంది. అయితే, కొందరు సినిమా తారలు అవకాశం ఉంది కదా అని సరదాగా వెళ్తుంటే.. మరి కొందరు కొన్ని బ్రాండ్స్ ప్రొమోషన్ కోసం, అక్కడి టూరిజం రిసార్ట్ ల ప్రచారం కోసం వెళ్తూ.. ఆ రకంగానూ సంపాదిస్తున్నారు. తాజాగా రుహానీ శర్మ కూడా ఇలాంటి హీరోయిన్ల సరసన చేరింది.
Also Read: Venu Swamy: ఆ స్టార్ హీరోలిద్దరూ సినిమాలకు దూరం అవుతారట
ఆమె ఇప్పుడు మాల్దీవుల్లోనే సరదాగా గడుపుతోంది. ఆమె ఒక బ్రాండ్ ప్రొమోషన్ కోసమే వచ్చి.. పనిలో పనిగా వెకేషన్ ను కూడా బాగా ఎంజాయ్ చేస్తోంది. పనిలో పనిగా బీచుల్లో రకరకాల భంగిమల్లో ఫోజులు ఇస్తూ, సరదాగా సముద్రం ఒడ్డున తిరుగుతూ రుహానీ శర్మ తెగ సంబరపడిపోతుంది. ఆ ఫోటోలని తన ఇన్ స్టాగ్రామ్ వేదికపై షేర్ చేస్తోంది.
27 సంవత్సరాల ఈ సుందరి.. హీరోయిన్ గా ఈ మధ్య మళ్ళీ బిజీగా మారింది. దాంతో, రుహానీ శర్మ తన పెళ్లి ఆలోచనని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. గతేడాది పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమవ్వాలని రుహానీ శర్మ భావించింది. ఐతే, ఇప్పుడు మళ్ళీ వరుసగా సినిమాలు ఆమె ఖాతాలో చేరుతున్నాయి. అందుకే.. కొన్నాళ్లు ఇండస్ట్రీలోనే కొనసాగాలని రుహానీ శర్మ ఫిక్స్ అయ్యింది.

నిజానికి రుహానీ శర్మ మంచి నటి. ఆమెలో గొప్ప టాలెంట్ ఉంది. ముఖ్యంగా చిన్న సినిమాలకు ఆమె బెస్ట్ ఆప్షన్. పైగా బాలీవుడ్ లో కూడా ఆమెకు కొన్ని అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం రుహానీ శర్మకి మధుర్ బండార్కర్ దర్శకత్వంలో రాబోతున్న ఓ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ వచ్చింది. ఇక తెలుగులో అవసరాల శ్రీనివాస్ చేస్తున్న కొత్త సినిమాలో కూడా రుహానీ శర్మకి ఛాన్స్ వచ్చింది.