దర్శక దిగ్గజం రాజమౌళి తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. భారీ బడ్జెట్లో ప్యాన్ ఇండియా మూవీగా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం రాబోతుంది. మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి ఈ మూవీలో కలిసి నటిస్తున్నారు. దీంతో ఈ మూవీపై మెగా, నందమూరి ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. వీరి అంచనాలకు మించిపోయేలా దర్శకుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీని తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
కరోనా కారణంగా ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ నిలిచిపోయింది. లేకుంటే ఈపాటికే సినిమా పూర్తి చేసుకొని పోస్టు ప్రొడక్షన్ పనులు చేసుకునేది. రాజమౌళి సినిమా అంటేనే భారీగా టెక్నిషియన్లు, నటులతోపాటు జూనియర్ ఆర్టిస్టులు ఉండి తీరాల్సిందే. ప్రస్తుతం కరోనా కారణంగా వారిని ఇబ్బందులు పెట్టడం ఇష్టం లేక రాజమౌళి ప్రస్తుతానికి షూటింగులను ప్రారంభించలేదని తెలుస్తోంది. అయితే ఈ మూవీ షూటింగ్ నవంబర్లో లేదా డిసెంబర్లో సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు.
ఆర్ఆర్ఆర్ షూటింగు నిలిచిపోయినప్పటికీ ఈ సినిమా గురించి నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్-పులి మధ్య వచ్చే ఫైట్ సీన్ సినిమాకే హైలట్ అవుతుందనే ప్రచారం జరుగుతోంది. తాజాగా మరో యాక్షన్ సీన్ కూడా సినిమాకే హైలట్ అయ్యేలా రాజమౌళి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. కదిలే ట్రైన్లో వచ్చే యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను థ్రిల్లింగ్ గురిచేస్తాయనే టాక్ విన్పిస్తోంది. సినిమాలు ఈ యాక్షన్ సీన్ 5 నుంచి 6 నిమిషాల పాటు ఉంటుందని సమాచారం. ఈ ఒక్క సీన్ కోసమే దాదాపు నెలరోజుల షూటింగ్ చేయనున్నారట.
ఇప్పటికే రాంచరణ్ పుట్టిన రోజున ‘ఆర్ఆర్ఆర్’ టీం విడుదల చేసిన ‘భీమ్ ఫర్ రామరాజు’ టీజర్ ప్రేక్షకుల్లో సినిమాపై భారీ అంచనాలు పెంచింది. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ కుతోడు చరణ్ ఫార్ఫామెన్స్ అదిరిపోవడంతో ఈ టీజర్ విడుదలైన కొద్దిగంటల్లోనే కొత్త రికార్డులను సృష్టించింది. ఇక ఎన్టీఆర్ టీజర్ కోసం ఫ్యాన్స్ అత్రుతగా ఎదురుచూస్తున్నారు. కొమురంభీం పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతరామరాజు పాత్రలో రాంచరణ్ నటిస్తుండటం ఆసక్తిని రేపుతోంది. చరణ్ కు జోడీగా అలియాభట్, ఎన్టీఆర్ సరసన ఓలివియా నటిస్తుండగా కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమా రిలీజు కోసం ప్రేక్షకులు అత్రుతగా ఎదురుచూస్తున్నారు.