RRR Movie: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినిమా లవర్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే.. కొమురం భీమ్‌గా ఎన్టీఆర్.. అల్లూరిగా రామ్ చరణ్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జనవరి 7న విడుదల కానుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్లు, పాటలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ సినిమా ట్రైలర్ డిసెంబర్ 3న విడుదల చేయాల్సి ఉంది. కానీ సిరివెన్నెల అకాల మరణంతో ట్రైలర్ రిలీజ్ వాయిదా వేశారు. డిసెంబర్ 9న ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్లుగా చిత్ర బృందం ప్రకటించారు.
ఈ తరుణంలో ట్రైలర్ విడుదలకు సమయం దగ్గర పడుతుండడంతో మూవీ వరుస పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు. ఈరోజు ఉదయం ఎన్టీఆర్ పోస్త్యర్ రిలీజ్ చేయగా… తాజాగా రామ్ చరణ్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో 6 ప్యాక్ బాడీతో అగ్రెసివ్ లుక్ లో చరణ్ అదరగొట్టారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. భారీ బడ్జెట్‌తో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తుండగా.. ఇందులో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్.. తారక్ జోడీగా హాలీవుడ్ హీరోయిన్ ఒలివియా మోరీస్ నటిస్తున్నారు. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్, శ్రియ, సముద్రఖని కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
That’s RAM for you… #RRRTrailer #RRRMovie #RRRTrailerin3Days pic.twitter.com/qlf1OsG8wc
— Ram Charan (@AlwaysRamCharan) December 6, 2021
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Rrr movie team released mew poster of mega power star ram charan
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com