Homeఎంటర్టైన్మెంట్RRR Movie: వార్నర్ బ్రదర్స్‌ తో కొలాబరేట్ కానున్న ఆర్‌ఆర్‌ఆర్ టీమ్...

RRR Movie: వార్నర్ బ్రదర్స్‌ తో కొలాబరేట్ కానున్న ఆర్‌ఆర్‌ఆర్ టీమ్…

RRR Movie: దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాలో  జూనియర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్  రామ్ చ‌ర‌ణ్ కలిసి నటిస్తున్నారు. కాగా వీరి సరసన  ఒలీవియా మోరిస్‌, ఆలియా భట్  హీరోయిన్స్ నటిస్తున్నారు. కాగా అజయ్ దేవగన్, శ్రియ , సముద్రఖని ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. కాగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్లు, వీడియో లకు అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ఈ తరుణంలోనే ఇటీవల ఇప్పటిదాకా చూడని ఎప్పుడూ వినని కలయిక అంటూ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు సంబంధించి దాని బృందం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

rrr movie team going to collaborate with warner brothers

ఇప్పుడు ప్రేక్షకులంతా ఆ కొలాబరేషన్ ఏంటా… అని ఆలోచనలో పడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో నిర్మాత డీవీవీ దానయ్య లోకల్ డిస్ట్రిబ్యూటర్లతో కలిసి సినిమాను రిలీజ్ చేస్తున్నారు. తమిళనాట లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తోంది. ఉత్తరాదిన పెన్ మూవీస్ ‘ఆర్ఆర్ఆర్’ హక్కులను సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమాకు సంబంధించి దేశీయంగా అన్ని బిజినెస్ అంతా పోర్తి అయ్యిందనే చెప్పాలి. ఇక ఈ మూవీ ఇంటర్నేషనల్ రైట్స్ గురించే ఈ అప్డేట్ అయ్యి ఉంటుందని సమాచారం.

అయితే ఇప్పుడు సినివర్గాల్లో చర్చించుకుంటున్న విషయం ప్రకారం… ఈ సినిమాను ప్రఖ్యాత హాలీవుడ్ నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్‌ తోడు అవ్వనుందంట. అంతర్జాతీయ స్థాయిలో ఆర్‌ఆర్‌ఆర్ చిత్రాన్ని పలు దేశాల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తుందని తెలుస్తుంది. ఇక ఈ కొలాబరేషన్ గురించే ఈరోజు ఆర్‌ఆర్‌ఆర్ టీమ్ ప్రకటించనున్నారని సోషల్ మీడియా లో టాక్ నడుస్తుంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version