RRR Movie Pre Release Business: ‘ఆర్ఆర్ఆర్’ రాక కోసం యావత్ భారతీయ సినీ అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. మరీ ఈ ఆతృత నడుమ భారీ స్థాయిలో రిలీజ్ అవుతున్న ‘ఆర్ఆర్ఆర్’కి ఇంతకీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగింది ? నిజానికి సినిమా ఎనౌన్స్ చేసిన దగ్గర నుంచి ‘ఆర్ఆర్ఆర్’ కోసం బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లు ఎగబడ్డారు. దాంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సినిమాకు బిజినెస్ జరిగింది.
దాదాపు 250 కోట్ల రూపాయలు వెచ్చించి అత్యంత గ్రాండ్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. 400 కోట్ల వరకు ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. పైగా ఈ సినిమాకి ఉన్న రేంజ్ కారణంగా థియేట్రికల్ రైట్స్ కోసం పలు సంస్థలు పోటీపడ్డాయి. మొత్తానికి ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్‌కి ముందే నిర్మాతలకు లాభాల పంట పండింది.
Also Read: Chiranjeevi: అందరం తిలకించి విజయవంతం చేద్దాం – చిరంజీవి
ఇక ఏపీ, తెలంగాణలో ఏరియాల వైజ్ గా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు ఎలా ఉన్నాయో చూద్దాం.
నైజాంలో రూ. 75 కోట్లు,
సీడెడ్‌లో రూ. 45 కోట్లు,
ఉత్తరాంధ్రలో రూ. 23 కోట్లు,
ఈస్ట్ గోదావరిలో రూ. 15 కోట్లు,
వెస్ట్ గోదావరిలో రూ. 13 కోట్లు,
గుంటూరులో రూ. 17 కోట్లు,
కృష్ణాలో రూ. 14 కోట్లు,
నెల్లూరులో రూ. 9 కోట్లు,
ఏపీ + తెలంగాణలో అన్నీ ఏరియాలు కలుపుకుని ఈ సినిమాకి రూ. 211 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ‘ఆర్ఆర్ఆర్’కి రూ. 211 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరగడం నిజంగా విశేషమే. ఈ పీరియాడికల్ ఎమోషనల్ అండ్ యాక్షన్ డ్రామాలో ఎన్టీఆర్ – చరణ్ కలిసి నటించడంతో ఈ సినిమాకి తిరుగు లేకుండా పోయింది.
Also Read: Bollywood Trends : బాలీవుడ్ లేటెస్ట్ క్రేజీ అప్ డేట్స్