NTR Oscar Awards Race: నేషనల్ విజువల్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ హీరోలుగా వచ్చిన క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. అద్భుత విజయాన్ని సాధించింది ఈ చిత్రం. కాగా ఆర్ఆర్ఆర్ సినిమా టోటల్ గా 5 అంశాల్లో ఆస్కార్ కి నామినేట్ అయ్యే ఛాన్స్ ఉందని సినీ వర్గాలు అంటున్నాయి. వాటిలో ఉత్తమ దర్శకుడు – ఎస్ఎస్ రాజమౌళి, ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ సినిమా, ఉత్తమ నటుడు – జూనియర్ ఎన్టీఆర్, అలాగే ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, ఉత్తమ ఒరిజినల్ సాంగ్ – దోస్తీ.

అయితే, ఆస్కార్ కి ఆస్కారం ఉన్నది మాత్రం తక్కువే అని తెలుస్తోంది. పలు ఇంగ్లీష్ ఫేమస్ వెబ్ సైట్స్ ఆర్టికల్స్ ప్రకారం.. అదర్ కంట్రీ యాక్టర్ కేటగిరీ కింద ‘ఆర్ఆర్ఆర్’ నుంచి నామినేట్ అయ్యే ఛాన్స్ ఉంది ఒక్క ఎన్టీఆర్ కే అని, కాబట్టి.. ఆర్ఆర్ఆర్ సినిమా తరుపున ఆస్కార్ కి ఆస్కారం ఉన్నది ఒక్క ఎన్టీఆర్ కి మాత్రమే అని తెలుస్తోంది. మరి ఎన్టీఆర్ కి ఆస్కార్ వస్తోందా ?. ఒకసారి ఎన్టీఆర్ బలబలాలు చూద్దాం.
Also Read: Bigg Boss 6 Telugu Faima: బొక్కబోర్లా పడిన గీతూ… రేవంత్‌కి చేసిన అన్యాయం ఫైమాకు తగిలిందిగా
విలక్షణ నటనలో ఎన్టీఆర్ కి నేటి కాలంలో ఇంకెవరూ సాటి లేరు. ఎన్టీఆర్ ఒక సమ్మోహన సంచలనాల సమాహారం, వినూత్న భావాల విశేషణం, ఎన్టీఆర్ విలక్షణ నటనా వినోదానికి చిరునామా. ఎన్నాళ్లైనా ఎన్నేళ్ళైనా ఎన్టీఆర్ ఎప్పటికీ నిత్యనూతన అధ్యయనమే. అందుకే, ఎన్టీఆర్ నేటి మహా నటుడు. మహా నటులు కనుమరుగైపోయిన ఈ తరంలో.. వెండితెర నటన వైభవానికి దిక్సూచిలా తారక్ తెలుగు తెర పై అడుగు పెట్టాడు.

నాలుగు పేజీలు డైలాగ్ లు చెప్పినా ఒప్పించలేని ఎన్నో క్లిష్టమైన ఎమోషన్స్ ను, ఎన్టీఆర్ కేవలం తన కను పాపలతోనే ఆ ఎమోషన్స్ ను పలికించగలడు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఒకే తరహాలో ఒప్పించగలడు. తన నటనతో నాట్యంతో జలధరించే విన్యాసాలు చేయగల సకల కళా వల్లభుడు జూ.ఎన్టీఆర్. అంత గొప్ప నటుడు కాబట్టి.. ఎన్టీఆర్ ఆస్కార్ రేసులో నిలబడే ఛాన్స్ ఎక్కువ.
Also Read: Samantha: హిందీలో సమంత క్రేజీ సినిమా.. వైరల్ అవుతున్న షేకింగ్ న్యూస్
ఇక ఆస్కార్ అందుకోగలిగే టాలెంట్ ఎన్టీఆర్ కి ఉందా ?. కచ్చితంగా ఉంది అనే చెప్పొచ్చు. నటుడిగా, నృత్య దార్శినికుడిగా, గాయకుడిగా, తెలుగులోనే కాదు యావత్ భారతదేశం అంతా జేజేలు పలుకే స్థాయి జూ.ఎన్టీఆర్ ది. పైగా ఏ పాత్ర చేసినా అందులో పాలలోని నీళ్లలా కలిసిపోవడం ఎన్టీఆర్ కి వెన్నతో పెట్టిన విద్య. ఆర్ఆర్ఆర్ లో భీమ్ పాత్రలో ఎన్టీఆర్ చేసింది ఇదే. అందుకే.. ఆస్కార్ అందుకునే అర్హత ఎన్టీఆర్ కి కచ్చితంగా ఉంది.