https://oktelugu.com/

RRR 9th Day Collections: రాజమౌళి నీరాజనాలతో బాక్సాఫీస్ చిన్నబోయింది

RRR 9th Day Collections: ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కలెక్షన్స్ చూసి భారతీయ సినీ బాక్సాఫీస్ షేక్ అయిపోతుంది. ఒక తెలుగు సినిమాకి ఈ స్థాయి కలెక్షన్సా ? అంటూ ప్రపంచ సినీ లోకమంతా సంభ్రమాశ్చర్యాలకు లోనవుతుంది. ఎంత విపరీతమైన అంచనాల మధ్య రిలీజ్ అయితే మాత్రం.. అసలు రోజురోజుకు వందల కోట్లును ఎలా కలెక్ట్ చేస్తోంది ? అంటూ ట్రేడ్‌ పండితులు సైతం ఆశ్చర్యచకితులు అవుతున్నారు. ఈ చిత్రం క్రియేట్ చేస్తున్న రికార్డులను కలెక్షన్ల ప్రవాహాన్ని ఈ […]

Written By: , Updated On : April 3, 2022 / 06:33 PM IST
Follow us on

RRR 9th Day Collections: ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కలెక్షన్స్ చూసి భారతీయ సినీ బాక్సాఫీస్ షేక్ అయిపోతుంది. ఒక తెలుగు సినిమాకి ఈ స్థాయి కలెక్షన్సా ? అంటూ ప్రపంచ సినీ లోకమంతా సంభ్రమాశ్చర్యాలకు లోనవుతుంది. ఎంత విపరీతమైన అంచనాల మధ్య రిలీజ్ అయితే మాత్రం.. అసలు రోజురోజుకు వందల కోట్లును ఎలా కలెక్ట్ చేస్తోంది ? అంటూ ట్రేడ్‌ పండితులు సైతం ఆశ్చర్యచకితులు అవుతున్నారు.

RRR 9th Day Collections

RRR 9th Day Collections

ఈ చిత్రం క్రియేట్ చేస్తున్న రికార్డులను కలెక్షన్ల ప్రవాహాన్ని ఈ సినిమా మేకర్స్ సైతం అంచనా వేయలేక నోరెళ్ళబెట్టి చూస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ బాక్సాఫీస్ రిపోర్ట్స్ ప్రకారం.. టోటల్ వరల్డ్ వైడ్ గా చూసుకుంటే.. ఫస్ట్ డే 203.07 కోట్లు కలెక్ట్, సెకండ్ డే 135.50 కోట్లు, మూడో రోజు 275.81 కోట్లు కలెక్ట్ చేసింది. అలాగే నాలుగో రోజు 315.58 కోట్లు కలెక్ట్ చేసింది. ఐదు రోజు 350.58 కోట్లు కలెక్ట్ చేసింది. ఆరు రోజు 179.04 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఏడు రోజులకు గానూ 391.47 కోట్లు కలెక్ట్ చేసింది. 8 రోజులకు గానూ 414.88 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే, 9 రోజులకు గానూ మొత్తం ఏపీ తెలంగాణలో ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేసిందో తెలుసుకుందాం.

Also Read: Bigg Boss Telugu OTT: బిగ్ బాస్ ఓటీటీ: నాగార్జున నోటినుంచి బూతు.. కంటెస్టెంట్స్ షాక్

నైజాం 90.05 కోట్లు

సీడెడ్ 42.10 కోట్లు

ఉత్తరాంధ్ర 27.17 కోట్లు

ఈస్ట్ 12.98 కోట్లు

వెస్ట్ 10.87 కోట్లు

గుంటూరు 15.24 కోట్లు

కృష్ణా 12.13 కోట్లు

నెల్లూరు 7.40 కోట్లు

ఏపీ + తెలంగాణలో మొత్తం కలుపుకొని 9 రోజులకు గానూ 217.94 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.

RRR 9th Day Collections

RRR 9th Day Collections

‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రానికి తెలుగుతో పాటు అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.492 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.500 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ఈ సినిమా ఫస్ట్ వీక్ గానూ అన్ని వెర్షన్లు కలుపుకుని టోటల్ వరల్డ్ వైడ్ గా 454.88 కోట్లు కలెక్ట్ చేసిందని అంచనా ఉంది.

ఒక తెలుగు సినిమా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ లో కూడా ఈ రేంజ్ ఫిగర్ ను నెలకొల్పడం సరి కొత్త రికార్డ్. హాలీవుడ్ భారీ సినిమాలకు వచ్చిన రేంజ్ లో.. ఈ సినిమాకి కలెక్షన్స్ రావడం తెలుగు సినీ ఇండస్ట్రీకే గర్వకారణం. దీనికి కారణం అయినా రాజమౌళి శుభాభినందనలు.

Also Read:Telangana Job Notification: నోటిఫికేషన్లు ఆలస్యం.. తెలంగాణ నిరుద్యోగులకు షాక్..

Tags