RRR Movie Box Office Collection: ఇంకా త‌గ్గ‌ని ఆర్ఆర్ఆర్ క్రేజ్‌.. 23వ రోజు రికార్డు క‌లెక్ష‌న్లు.. మొత్తంగా ఎంత లాభ‌మంటే..?

RRR Movie Box Office Collection: ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి ఇద్ద‌రు స్టార్ హీరోలైన రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్‌ను పెట్టి తీసిన ఆర్ ఆర్ ఆర్ ఇప్ప‌టికీ దుమ్ములేపుతూనే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచానాల‌తో వ‌చ్చిన ఈ మూవీ హై ఓల్టేజ్ సీన్ల‌తో సంచ‌ల‌న విజ‌యం న‌మోదు చేసిది. నార్త్ టు సౌత్ దాకా ఎక్క‌డ చూసినా రికార్డుల సునామీ సృష్టిస్తోంది. రిలీజ్ అయి 23రోజులు అవుతున్నా కూడా ఇంకా థియేట‌ర్ల‌కు జ‌నాలు క్యూ క‌డుతూనే […]

Written By: Mallesh, Updated On : April 17, 2022 2:51 pm
Follow us on

RRR Movie Box Office Collection: ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి ఇద్ద‌రు స్టార్ హీరోలైన రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్‌ను పెట్టి తీసిన ఆర్ ఆర్ ఆర్ ఇప్ప‌టికీ దుమ్ములేపుతూనే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచానాల‌తో వ‌చ్చిన ఈ మూవీ హై ఓల్టేజ్ సీన్ల‌తో సంచ‌ల‌న విజ‌యం న‌మోదు చేసిది. నార్త్ టు సౌత్ దాకా ఎక్క‌డ చూసినా రికార్డుల సునామీ సృష్టిస్తోంది. రిలీజ్ అయి 23రోజులు అవుతున్నా కూడా ఇంకా థియేట‌ర్ల‌కు జ‌నాలు క్యూ క‌డుతూనే ఉన్నారు.

RRR Movie Box Office Collection

ఇక కేజీఎఫ్‌-2 లాంటి భారీ పాన్ ఇండియా మూవీ వ‌చ్చినా.. ఈ మూవీపై పెద్ద‌గా ప్ర‌భావం చూపించ‌లేక‌పోయింది. ఈ మూవీ జోన‌ర్ ముందు కేజీఎఫ్ ఎఫెక్ట్ పెద్ద‌గా ప‌డ‌లేదు. ఇక‌పోతే ఈ మూవీ 23వ రోజు కూడా మైండ్ బ్లోయింగ్ కలెక్ష‌న్ల‌తో దుమ్ములేపింది. దీంతో భారీ లాభాలు వ‌చ్చిప‌డుతున్నాయి. వాస్త‌వానికి ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ప్రీరిలీజ్ బిజినెస్‌ను రూ.191 కోట్లుగా న‌మోదు చేసింది.

Also Read: Beast Box Office Collection: బీస్ట్ మూవీకి నాలుగో రోజు దారుణ‌మైన క‌లెక్ష‌న్లు.. బ్రేక్ ఈవెన్ క‌ష్ట‌మేనా..?

ఇక ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.451 కోట్ల బిజినెస్ జ‌రుపుకుంది. అయితే 23వ రోజు నైజాంలో రూ. 31 లక్షల‌తో టాప్ క‌లెక్ష‌న్లు వ‌చ్చాయి. ఇక దాని త‌ర్వాత సీడెడ్‌లో రూ. 12 లక్షలు అలాగే ఉత్తరాంధ్రలో రూ.8 లక్షల‌తో ఇలా అన్ని ప్రాంతాల్లో మంచి క‌లెక్ష‌న్ల‌ను వ‌సూలు చేసింది ఈ మూవీ. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో క‌లిపి ఈ మూవీకి 23వ‌రోజు రూ.67 లక్షల షేర్ తో పాటుగా రూ.1.05 కోట్లు గ్రాస్ వ‌చ్చింది.

RRR Movie Box Office Collection

ఇక మొత్తంగా 23రోజుల్లో క‌లిపి తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీకి రూ.262.58 కోట్ల షేర్ రావ‌డంతో పాటు.. రూ.396.05 కోట్ల గ్రాస్ రాబ‌ట్టింది. అటు ప్ర‌పంచ వ్యాప్తంగా రూ. 581.69 కోట్లు షేర్ తో పాటు రూ.1,071 కోట్ల గ్రాస్ న‌మోదు చేసింది ఈ మూవీ. ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 451 కోట్లు. అంటే 128.69 కోట్ల లాభాలు వ‌చ్చాయ‌న్న‌మాట‌. ఎంతైనా రాజ‌మౌళి సినిమా అంటే ఇలాగే ఉంటుంది మ‌రి.

Also Read:Chiranjeevi Acharya Pre Release Event: ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిధి ఎవరో తెలుసా?

Tags