RRR
RRR Creating Records In OTT: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన భారీ మల్టీస్టార్ర్ర్ చిత్రం #RRR విడుదల అయ్యి ఎలాంటి సెన్సషనల్ హిట్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..విడుదల అయినా అన్ని బాషలలో ఈ సినిమా అద్భుతమైన వసూళ్లను రాబట్టి, అటు రామ్ చరణ్ కి ఇటు ఎన్టీఆర్ కి అన్ని బాషలలో మంచి క్రేజ్ వచ్చేలా చేసింది..దాదాపుగా 1150 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసిన ఈ సినిమా ఆల్ టైం హైయెస్ట్ ఇండియన్ గ్రాస్ సాధించిన సినిమాలలో టాప్ 3 గా నిలిచింది..బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ స్థాయి విద్వంస్వం సృష్టించిన ఈ సినిమా ఇటీవలే OTT లో విడుదల అయినా సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ 5 యాప్ వారు కనివిని ఎరుగని రేంజ్ రేట్స్ తో కొనుగోలు చేసారు..ఇటీవలే ఈ సినిమా హిందీ భాషలో తప్ప అన్ని బాషలలో జీ 5 యాప్ లో విడుదల అయ్యింది..విడుదల అయినా రోజు నుండి నేటి వరుకు ఈ సినిమా జీ 5 యాప్ లో ఇప్పటి వరుకు ఉన్న రికార్డ్స్ అన్నిటిని కూడా బద్దలు కొట్టేసింది.
RRR
అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకి జీ 5 యాప్ లో అన్ని భాషలకు కలిపి వెయ్యి మిలియన్ వాచ్ మినిట్స్ వచ్చినట్టు తెలుస్తుంది..ఇది ఒక్క ఆల్ టైం ఇండియన్ రికార్డు గా చెప్పుకోవచ్చు..ఇక ఈ సినిమాకి సంబంధించిన హిందీ వెర్షన్ ని నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేసిన సంగతి మన అందరికి తెలిసిందే..ఇక్కడ కూడా ఈ సినిమా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తుంది..ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో దాదాపుగా 63 దేశాల్లో ట్రేండింగ్ అవుతుంది..అందులో 20 దేశాల్లో ఈ సినిమా నెంబర్ 1 స్థానం లో ట్రేండింగ్ అవుతుంది అంటే మాములు విషయం కాదు అనే చెప్పాలి..బాహుబలి సిరీస్ కి కూడా OTT లో వచ్చినప్పుడు ఈ రేంజ్ క్రేజ్ లేదు..ఈ చిత్రం లో రాజమౌళి తెరకెక్కించిన పోరాట సన్నివేశాలకు ఇతర దేశాల ఆడియన్స్ కూడా ఫిదా అయిపోయారు.
Also Read: Sarkaru Vaari Paata 18 days Collections: వావ్.. 18వ రోజు కూడా మహేష్ కుమ్మేశాడు !
ఎంతో మంది విదేశీయులు ఈ సన్నివేశాలను సోషల్ మీడియా లో అప్లోడ్ చేస్తూ రాజమౌళి ని టాగ్ చేసి పొగడ్తల వర్షం కురిపించిన సందర్భాలు మనం ఎన్నో చూసాము..ఈ సినిమా థియేటర్స్ లో ఎంత పెద్ద విజయం సాధించిందో, OTT లో వచ్చిన తర్వాత కూడా అదే స్థాయి విజయం సాధించింది..విదేశాల్లో #RRR కి వస్తున్నా రెస్పాన్స్ చూసి, ఈ సినిమాకి సంబంధించిన అన్ ఎడిట్ వర్షన్ ని కొన్ని థియేటర్స్ లో విడుదల చెయ్యబోతున్నారు..ఇప్పటికే కొన్ని థియేటర్స్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చెయ్యగా..హాట్ కేక్స్ లాగ టికెట్స్ అమ్ముడుపోయాయి..ఈ ట్రెండ్ ని చూస్తూ ఉంటె రీ రిలీజ్ లో కూడా ఈ సినిమా దుమ్ము లేపేయడం ఖాయం అనిపిస్తుంది.
Also Read: Hrithik Roshan in KGF 3: షాకింగ్..KGF 3 లో హృతిక్ రోషన్..ఏ రోల్ తెలుసా??