ఒకపక్క కరోనా మూడో వేవ్ తో భయపెట్టడానికి సిద్ధం అవుతున్నట్లు కనిపిస్తుంది. మరోపక్క, తమ సినిమా “ఆర్ఆర్ఆర్”ను అక్టోబర్ 13న విడుదల చేస్తున్నాం అంటూ.. ఆర్ఆర్ఆర్ టీమ్ ప్రమోషన్స్ ను వేగవంతం చేస్తోంది. మరి నిజంగానే అక్టోబర్ 13న ఈ సినిమా రిలీజ్ అవుతుందా ? సినీ జనంలో కూడా ఇప్పుడు ఇదే పెద్ద డౌట్. అసలు ఏ నమ్మకంతో రాజమౌళి ఇంత దైర్యంగా రిలీజ్ కి సన్నద్ధం అవుతున్నాడు ?
నిజానికి ఇండియాలో మూడు, నాలుగు రాష్ట్రాల్లో తప్ప.. ఇంతవరకు ఎక్కడా థియేటర్లు ఓపెన్ కాలేదు, అలాగే ఇప్పట్లో ఓపెన్ చేసే పరిస్థితి కూడా లేదు. మరి పాన్ ఇండియా సినిమాలకు మెయిన్ మార్కెట్.. నార్త్ ఇండియానే. ఆ లెక్కన కీలకమైన నార్త్ ఇండియాలో మరో మూడు నెలలు దాకా థియేటర్ మార్కెట్ పుంజుకునేలా కనిపించడం లేదు.
కాబట్టి, ట్రేడ్ పండితులు అంచనా ప్రకారం “ఆర్ఆర్ఆర్” మరోసారి వాయిదా పడుతుందని చెబుతున్నారు. కాకపోతే రాజమౌళి టీం మాత్రం సినిమా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది. అవకాశం దొరికినప్పుడల్లా పబ్లిసిటీ చేసుకుంటూ పోతున్నారు. ఇందులో భాగంగానే ఈ రోజు నుంచి ఎన్టీఆర్ ఇన్ స్టాగ్రామ్ ఎకౌంట్ ను “ఆర్ఆర్ఆర్” బృందం కొన్నాళ్ళు పాటు తమ ఆధీనంలో పెట్టుకోనుంది.
ఏది ఏమైనా అక్టోబర్ 13న తమ సినిమా రిలీజ్ ఖాయం అంటున్న రాజమౌళి టీమ్.. ప్రస్తుతం ప్యాచ్ వర్క్ షూట్ లో ఫుల్ బిజీగా ఉంది. అయినా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి జరిగిన బిజినెస్ 700 కోట్లు. ఒక్క థియేటర్ రైట్స్ ద్వారే దాదాపు 400 కోట్లు వచ్చాయి. మరో 300 వందల కోట్లు వరకు ఇతర మాధ్యమాల ద్వారా వస్తోంది.
మరి 700 కోట్లు బిజినెస్ విషయంలో ఎంతో ప్లాన్డ్ గా ఉంటే తప్పితే.. ఆర్ఆర్ఆర్ టీమ్ అక్టోబర్ 13న రిలీజ్ కి సన్నద్ధం అవ్వదు. ఇంతకీ,రాజమౌళి దైర్యం ఏమిటి ? ఆయన ప్లాన్ ఏమిటనేది కొన్ని రోజులు ఆగితే గానీ, క్లారిటీ రాదు. అయితే, ముందుగానే అనుకున్నట్లు అక్టోబర్ 13న ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ అయితే.. ఇక తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల ముందు భారీ ఎత్తున జాతర ఉంటుంది.