
Rajamouli – RRR2: సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వచ్చారు దర్శకుడు రాజమౌళి. బాహుబలి సిరీస్ తో ఇండియా వైడ్ పాపులారిటీ తెచ్చుకున్న ఈ దర్శకధీరుడు ఆర్ ఆర్ ఆర్ తో ఎల్లలు దాటేశాడు. ఏకంగా ఆస్కార్ కొల్లగొట్టి ఏ ఇండియన్ దర్శకుడికి అందనంత ఎత్తుకు ఎదిగారు. రాజమౌళి ఇప్పుడో గ్లోబల్ డైరెక్టర్. భవిష్యత్తులో ఆయన నుండి వచ్చే చిత్రాలకు వరల్డ్ వైడ్ మార్కెట్ ఉంటుంది.క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యమని నమ్మిన రాజమౌళి రెండు దశాబ్దాల కెరీర్లో కేవలం 12 సినిమాలు చేశారు.
ఈగ సినిమా 2012లో విడుదల కాగా… ఆర్ ఆర్ ఆర్ 2022లో విడుదలైంది. ఈ పదేళ్లలో రాజమౌళి చేసింది కేవలం మూడు సినిమాలు. ఇక ఆర్ ఆర్ ఆర్ గ్లోబల్ సక్సెస్ నేపథ్యంలో సీక్వెల్ పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఈ క్రమంలో రాజమౌళి స్వయంగా స్పష్టత ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ… ఆస్కార్ విజయం నా మీద మరింత బాధ్యత పెంచింది. ఆర్ ఆర్ ఆర్ 2 పనులు వేగవంతం చేయాల్సి ఉంది. ఇక భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి అన్నారు.
రాజమౌళి కామెంట్స్ ఆర్ ఆర్ ఆర్ మూవీ ఫ్యాన్స్ లో ఆనందం నింపాయి. గతంలోనే రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ 2 ఉంటుందని చెప్పారు. దీని కోసం ఒక కథ కూడా అనుకున్నట్లు వెల్లడించారు. తాజాగా ఆయన మరింత క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చేందుకు చాలా సమయం ఉంది. అందుకే రాజమౌళి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలని ముగించారు. నెక్స్ట్ ఆయన హీరో మహేష్ మూవీ కంప్లీట్ చేయాల్సి ఉంది. ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

ఇదే ఏడాది మహేష్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుందనేది విశ్వసనీయ సమాచారం. మహేష్ మూవీతో మరిన్ని ఆస్కార్ అవార్డ్స్ పై రాజమౌళి గురి పెట్టనున్నారట. ప్రపంచ సినిమాతో పోటీపడేలా అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కిస్తారట. ఇక విదేశీ సాంకేతిక నిపుణులు, నటులు ఈ ప్రాజెక్ట్ కి పని చేయనున్నారట. రూ. 800 నుండి 1000 కోట్ల బడ్జెట్ ఈ చిత్రానికి కేటాయిస్తున్నట్లు సమాచారం. ఇది యాక్షన్ అడ్వెంచర్ డ్రామా. మహేష్ ని సరికొత్తగా ప్రజెంట్ చేయబోతున్నాడట. మహేష్ జిమ్ బాడీతో కనిపించే ఆస్కారం కలదంటున్నారు. ఇటీవల మహేష్ జిమ్ లో కసరత్తులు చేస్తున్న ఫోటోలు షేర్ చేసిన విషయం తెలిసిందే.