https://oktelugu.com/

RRR 19th Day: బాక్సాఫీస్ వద్ద కొనసాగుతున్న ‘ఆర్ఆర్ఆర్’ హవా..!

RRR 19th Day Collections World Wide: రాంచరణ్, రామారావు, రాజమౌళి(ఆర్ఆర్ఆర్) కాంబినేషన్లో వచ్చిన రౌద్రం రణం రుధిరం(ఆర్ఆర్ఆర్) బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ఈ మూవీ విడుదలై 20రోజులు గడుస్తున్నా బాక్సాఫీస్ వద్ద ‘ఆర్ఆర్ఆర్’ కలెక్షన్స్ ఏమాత్రం తగ్గడం లేదు. వరల్డ్ వైడ్ గా ‘ఆర్ఆర్ఆర్’ భారీ వసూళ్లను రాబడుతుండటంతో ఈ సినిమా వెయ్యి కోట్ల మార్క్ ను దాటేసింది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను మేకర్స్ ఐమాక్స్, త్రిడీ, డాల్బీ ఫార్మాట్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు. […]

Written By:
  • NARESH
  • , Updated On : April 13, 2022 / 01:15 PM IST
    Follow us on

    RRR 19th Day Collections World Wide: రాంచరణ్, రామారావు, రాజమౌళి(ఆర్ఆర్ఆర్) కాంబినేషన్లో వచ్చిన రౌద్రం రణం రుధిరం(ఆర్ఆర్ఆర్) బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ఈ మూవీ విడుదలై 20రోజులు గడుస్తున్నా బాక్సాఫీస్ వద్ద ‘ఆర్ఆర్ఆర్’ కలెక్షన్స్ ఏమాత్రం తగ్గడం లేదు. వరల్డ్ వైడ్ గా ‘ఆర్ఆర్ఆర్’ భారీ వసూళ్లను రాబడుతుండటంతో ఈ సినిమా వెయ్యి కోట్ల మార్క్ ను దాటేసింది.

    RRR 19th Days Collections

    ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను మేకర్స్ ఐమాక్స్, త్రిడీ, డాల్బీ ఫార్మాట్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు. డాల్బీలో విడుదలైన తొలి ఇండియన్ సినిమాగా ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు నెలకొల్పింది. ఇక ఈ మూవీ విడుదలైన 19 రోజుల్లోనే అన్ని ఏరియాల్లోపై బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. ఓవరాల్ గా ఈ మూవీ కలెక్షన్లు బాహుబలితో పోటీ పడుతున్నాయి.

    19వ రోజు ‘ఆర్ఆర్ఆర్’ కలెక్షన్స్ విషయానికొస్తే.. తెలంగాణ రూ. 19 లక్షలు, ఏపీలో 45 లక్షలు మొత్తంగా రూ. 64 లక్షల షేర్ (రూ.1 కోటి గ్రాస్) వసూళ్లను రాబట్టింది. అలాగే ఓవర్సీస్, తమిళనాడు, కర్ణాటక మిగిలిన ప్రాంతాల్లో కలిపి ‘ఆర్ఆర్ఆర్’కు రూ. 2.02 కోట్లు వచ్చాయి. ఈ రెంటింటిని కలిపితే ప్రపంచ వ్యాప్తంగా 19వ రోజు రూ. 2.66 కోట్లు షేర్(రూ. 6.50 కోట్లు గ్రాస్)ను ఈ సినిమా రాబట్టింది.

    ప్రపంచ వ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్’ 19రోజుల కలెక్షన్స్ విషయాకొస్తే.. తెలుగు రాష్ట్రాల్లో రూ. 259.77 కోట్లు (రూ. 391.65 కోట్లు గ్రాస్) వచ్చింది. కర్ణాటకలో రూ. 42.05 కోట్లు / రూ. 41 కోట్లు, తమిళనాడులో రూ. 37.05 కోట్లు / రూ. 35 కోట్లు, కేరళలో 10.24 కోట్లు / రూ. 9 కోట్లు, హిందీలో 117.75 కోట్లు / రూ. 92 కోట్లు, రెస్టాఫ్ భారత్ లో రూ.8.70 కోట్లు / రూ. 8 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 95.55 కోట్లు/ రూ. 75 కోట్లను రాబట్టింది.

    ప్రపంచ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ టోటల్ వరల్డ్ వైడ్ బిజినెస్ రూ.. 451 కోట్లను చేసింది. మొదటి రోజే ఏకంగా 135 కోట్లు ( 235 కోట్లు గ్రాస్ ) రాబట్టింది. రెండో రోజు రూ. 67.44 కోట్లు (121 కోట్లు గ్రాస్ ), మూడో రోజు రూ. 78.73 కోట్లు (రూ. 140 కోట్లు గ్రాస్) రాబట్టి సత్తా చాటింది. 19వ రోజు రూ. 2.66 కోట్లు (రూ. 6.50 కోట్లు గ్రాస్)ను రాబట్టింది. మొత్తంగా 19 రోజుల్లో రూ. 571.11 కోట్లు షేర్ (రూ.1046.10 కోట్ల గ్రాస్) వచ్చింది.