Champion Movie First Review: సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ (Roshan)నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఛాంపియన్'(Champion Movie) ఈ క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నిన్ననే ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథి గా విచ్చేయడం, శ్రీకాంత్ కొడుకు రోషన్ గురించి మాట్లాడడం హైలైట్ అంశాలు గా నిల్చింది. థియేట్రికల్ ట్రైలర్ కూడా ఆడియన్స్ ని అమితంగా ఆకట్టుకుంది. వైజయంతి మూవీ బ్యానర్ లో ఒక సినిమా తెరకెక్కుతుంది అంటేనే భారీ గా ఉంటుంది అనేది మైండ్ లో బ్లైండ్ గా ఫిక్స్ అయిపోతారు ఆడియన్స్. ఈ సినిమా కూడా అలాగే ఉంటుందని అనుకున్నారు. ట్రైలర్ ని చూస్తే అంతకు మించే ఉన్నట్టుగా అనిపించింది. బడ్జెట్ భారీ గా ఖర్చు చేశారు మేకర్స్. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన మొదటి కాపీ సిద్ధం అవ్వడం తో, మేకర్స్ కొంతమంది మీడియా ప్రతినిధులకు స్పెషల్ షో వేసి చూపించారట.
వాళ్ళ నుండి వచ్చిన టాక్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ సినిమాని స్వాతంత్రం వచ్చిన తర్వాత, హైదరాబాద్ లో నిజాం పాలనలో జరిగిన కొన్ని సంఘటనలను ఆధారంగా తీసుకొని తెరకెక్కించారట. ఫస్ట్ హాఫ్ మొత్తం యూత్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యే విధంగా , చక్కటి లవ్ స్టోరీ తో మంచి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో తెరకెక్కించాడట డైరెక్టర్ ప్రదీప్ అద్వైతం. తొలిసినిమానే అయినప్పటికీ ప్రదీప్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చి దిద్దడం లో సక్సెస్ అయ్యినట్టు తెలుస్తోంది. ఇక సెకండ్ హాఫ్ లో నిజాం పాలనలో జరిగిన అల్లర్ల కారణంగా హీరో క్యారక్టర్ కి ఎదురైనా సంఘటనలు ఆధారంగా తీసిన సన్నివేశాలు చాలా అద్భుతంగా వచ్చాయట. ఎమోషన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యినట్టు తెలుస్తోంది.
ఇక ఈ చిత్రం లో హీరోయిన్ గా నటించిన మలయాళం బ్యూటీ అనశ్వరరాజన్ కూడా అద్భుతంగా నటించినట్టు తెలుస్తోంది. ఇది ఆమెకు తెలుగు లో మొదటి సినిమా అయ్యుండొచ్చు కానీ, మలయాళం లో ఇప్పటి వరకు ఆమె పాతిక సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఇక రోషన్ గురించి ప్రత్యేకేకించి మాట్లాడుకోవాలి. పెళ్లి సందడి తర్వాత నాలుగేళ్ల గ్యాప్ తో చేసిన చిత్రమిది. పెళ్ళిసందడి లో రోషన్ నటన, డ్యాన్స్, ఫైట్స్ చూసి టాలీవుడ్ హృతిక్ రోషన్ అని అందరూ మెచ్చుకున్నారు. అలాంటి హీరో ఇంత గ్యాప్ తీసుకోవడం పై విమర్శలు వచ్చాయి. అతనితో పాటు పెళ్ళిసందడి లో హీరోయిన్ గా నటించిన శ్రీలీల స్టార్ హీరోయిన్ గా మారి ఇప్పుడు దేశం మొత్తం చుట్టేస్తోంది. అలాంటిది రోషన్ నుండి రెండవ సినిమా రావడానికి ఇన్నేళ్ల సమయం పట్టింది. అయితే అతను ఎందుకు ఇన్నేళ్ల సమయం ఈ సినిమా కోసం తీసుకున్నాడు అనేది ఈ చిత్రం చూస్తే అర్థం అవుతుందట. ఇలాంటి సినిమా కోసం అన్నేళ్లు కేటాయించడం లో తప్పు లేదని అంటున్నారు. మరి ఆడియన్స్ ఈ చిత్రాన్ని ఎలా ఆదరిస్తారో చూడాలి.