Rocking Rakesh: ప్రముఖ బుల్లతెర కామెడీ షో జబర్దస్ట్ కమిడియన్ రాకింగ్ రాకేశ్ శంషాబాద్ మున్సిపాలిటీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యారు. ఆదివారం నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షన్-2022 సంవత్సర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాకింగ్ రాకేశ్.. అక్కడి వారితో కాసేపు ముచ్చటించారు. అనంతరం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్లో మునిసిపల్ సిబ్బది, అంగన్వాడి టీచర్లకు అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలోనే మున్సిపల్ చైర్పర్సన్ సుష్మ, నర్సింగ్ మార్కెట్ కమిటీ చైర్మన్ దూడల వెంకటేష్ గౌడ్, కౌన్సిలర్ తోకల విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ సాబీర్ అలీ, కౌన్సిలర్లు భారతమ్మ, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగానే శంషాబాద్ మున్సిపల్ బ్రాండ్ అంబాసిడర్ గా జబర్దస్త్ రాకింగ్ రాకేష్ ను ఎంపిక చేశారు.
ఓ వైపు కామెడి స్కిట్లతో బుల్లితెరపై నవ్వులు పూయిస్తూనే.. మరోవైపు వెండితెరపై మంచి అవకాశాలు దక్కించుకుంటూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రాకేశ్. ప్రస్తుతం ఇంకా జబర్దస్త్‌లో కొనసాగుతున్నారు. ఇప్పటికి తన కెరీర్లో కొన్ని వందల స్కిట్లతో జనాలను నవ్వించి.. వారి అభిమానాన్ని అందుకున్నారు. కాగా, పిల్లలతో కూడా షో నడిపించొచ్చని తెలుసుకుని.. వారితోనే మంచి స్టోరీ ప్లాట్ రాసి.. వారి చిట్టి పొట్టి క్యూట్ మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుని తన స్కిట్ల కోసం వేయిట్ చేయించేలా చేసిన సత్తా ఉన్న వ్యక్తి రాకేశ్.
టీమ్‌లో కంటెస్టెంట్‌గా ఉన్న స్థాయి నుంచి టీమ్ లీడర్‌గా మారే వరకు ఎన్నో కష్టాలు, అవమానాలు భరించి.. ఈ స్థాయిలో కూర్చున్నాడు.