RK Roja And Vedala Rajini: ఏపీలో( Andhra Pradesh) మహిళా నేతలకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది.. అన్ని పార్టీల్లోనూ వారికంటూ ఒక ఇమేజ్ ఉంటుంది. అలా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇమేజ్ దక్కించుకున్నారు రోజా, విడదల రజిని. రోజా అయితే దశాబ్ద కాలం ఎమ్మెల్యే అయ్యేందుకు వేచి చూశారు. తెలుగుదేశం పార్టీలో వర్కౌట్ కాకపోయేసరికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి తన ఎమ్మెల్యే కలను సాకారం చేసుకున్నారు. ఏకంగా మంత్రి అయ్యారు కూడా. విడదల రజిని అయితే తొలి ప్రయత్నం లోనే ఎమ్మెల్యే అయిపోయారు. తెలుగుదేశం పార్టీలో ద్వితీయ శ్రేణి నేతగా ఎంట్రీ ఇచ్చి.. వైసీపీలో చేరి ఎమ్మెల్యేగా, ఆపై మంత్రిగా తన మార్కు చూపించుకున్నారు. అయితే ఇప్పుడు ఆ ఇద్దరూ మహిళ నేతలు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సైతం మునుపటి మాదిరిగా యాక్టివ్ గా లేకపోతున్నారు.
* నగిరి కి ప్రత్యామ్నాయ నేత..
రాజకీయాలు అన్నాక పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు. ఇక్కడ రకరకాల సమీకరణలు పనిచేస్తాయి. అందుకు అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయి. రోజా( RK Roja) విషయంలో ఈసారి నగిరి టిక్కెట్ ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. అక్కడ ఇన్ని రోజులు రాజకీయం చేసిన రోజా మిగతా వారిని కలుపు కెల్లలేకపోతున్నారు. రాజకీయ ప్రత్యర్థుల మాదిరిగానే సొంత పార్టీ నేతల విషయంలో కూడా ఆమె వ్యవహరిస్తున్నారు అలానే. 2014, 2019 ఎన్నికల్లో ఆమె తక్కువ ఓట్లతోనే గెలిచారు. 2024 ఎన్నికలకు వచ్చేసరికి ఎక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇప్పటికీ సొంత పార్టీ నేతలతో సఖ్యత ఏర్పరుచుకోలేదు. పైగా చిత్తూరు జిల్లాలో సీనియర్ మాజీ మంత్రి తో వైరం పెంచుకుంటున్నారు. అయితే ఇప్పుడు పార్టీని బాగు చేసే పనిలో ఉన్నారు జగన్. అందుకే రోజాను తప్పించి మరో నేతను ఇంచార్జిగా ప్రకటిస్తారని తెలుస్తోంది. పార్టీ అధికారంలోకి వస్తే నామినేటెడ్ పదవి ఇస్తానని రోజాకు జగన్ తేల్చి చెప్పినట్లు సమాచారం. అందుకు ఆమె అంగీకరిస్తే పర్వాలేదు. లేకుంటే బయటకు వెళ్లిపోయిన పర్వాలేదు అన్న రీతిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది.
* రేపల్లె వెళ్లాలని..
మాజీ మంత్రి విడదల రజనీ( vedala Rajini ) విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక ఆలోచన చేస్తున్నారు. చిలకలూరిపేట నుంచి గెలిచిన ఆమెను గత ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి షిఫ్ట్ చేశారు. అక్కడ వర్కౌట్ కాకపోవడంతో ఆమె తిరిగి చిలకలూరిపేట వచ్చేసారు. ఇక ఆ నియోజకవర్గం తనదేనన్న నిర్ణయానికి వచ్చారు. మర్రి రాజశేఖర్ లాంటి నేతలు పార్టీ నుంచి బయటకు వెళ్లిపోవడంతో.. ఇక తనకు తిరుగు లేదన్న భావనకు వచ్చారు. అయితే ఆమెను రేపల్లె పంపించి మంత్రి అనగానే సత్యప్రసాద్ ను ఓడించాలని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అందుకు ఒప్పుకోవడం లేదు రజని. అవసరం అయితే పోటీ చేయకుండా ఉండిపోతానని.. రేపల్లె నుంచి మాత్రం పోటీ చేయనని తేల్చి చెబుతున్నారు. చేస్తే రేపల్లె నుంచి.. లేకుంటే పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయిన పర్వాలేదని సంకేతాలు అధినేత నుంచి వస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. అయితే ఈ కొత్త సంవత్సరంలో ఈ ఇద్దరు మహిళా నేతల భవితవ్యం తేలనుంది. మరి అధినేత ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో.. ఈ మహిళ నేతలు ఎలాంటి అడుగులు వేస్తారో చూడాలి.