Ritu Varma: రీతూ వర్మ.. అచ్చ తెలుగు హీరోయిన్. అందుకే, తెలుగులో స్టార్ హీరోల సినిమాల్లో తనకు హీరోయిన్ గా ఛాన్స్ లు రావడం లేదు అంటుంది రీతూ. నిజానికి కెరీర్ కొత్తల్లో ఎక్స్ పోజింగ్ విషయంలో రీతూ వర్మ మొహమాట పడింది. దాంతో ఆమె కెరీర్ అనుకున్నంత స్పీడ్ గా సాగలేదు. నత్తలా నెమ్మదిగా సాగుతూ చిన్నాచితకా చిత్రాల హీరోయిన్ గానే రీతూ వర్మ గుర్తింపు తెచ్చుకుంటూ వచ్చింది.

అయితే, రీతూ వర్మ కు మలయాళంలో మంచి స్టార్ డమ్ వచ్చింది. ప్రస్తుతానికి రీతూ వర్మ చేతిలో తెలుగు సినిమాలకు సంబంధించి క్రేజీ ఆఫర్లేవీ లేవు. కానీ.. మలయాళంలో మాత్రం ఆమె చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. కాకపోతే రీతూ వర్మకి తెలుగులో సినిమాలు చేయడమే ఇష్టం అట. అందుకే.. ఏ మాత్రం నిరాశ చెందకుండా ఛాన్స్ ల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంది.
ఈ క్రమంలో రీతూ వర్మ తాజాగా ఒక నిర్ణయం తీసుకుంది. ఛాన్స్ లు రావాలి అంటే.. బోల్డ్ గా కనిపించాలి అని నిర్ణయించుకుంది. ఆ నిర్ణయానికి తగినట్టుగానే రీతూ వర్మ ఈ మధ్య షేర్ చేస్తున్న ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. రీతూ వర్మ ఫోటోల మీద నెటిజన్లు కూడా రియాక్ట్ అవుతున్నారు. ‘ఇంత హాట్‌గా ఎలా తయారయ్యావ్ ?’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
అయితే, పెద్ద సినిమాల్లో ఛాన్స్ ల కోసం రీతూ వర్మ తన వైపు నుంచి అన్ని ప్రయత్నాలు చేస్తోన్నా… టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఆమెను ఆదరించడం లేదు. అందుకే రీతూ వర్మ గ్లామరస్ గా కనిపించేందుకు బోల్డ్ ఫోటో షూట్ లు చేస్తూ మొత్తానికి రచ్చ చేయడానికి తెగ కష్టపడుతుంది. అలాగే పరాయి భాషల భామలకు పోటీ ఇచ్చేందుకు బికినీ కూడా వేయడానికి సై అంటుంది.

పైగా రీతూ వర్మ క్రమం తప్పకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ హాట్ ఫోటోలు షేర్ చేస్తోంది. ఇక రెగ్యులర్ గా తనకు సంబంధించిన అప్డేట్స్ నెటిజన్లతో పంచుకుంటూ ఫాలోవర్స్ ను పెంచుకోవడానికి నానా కష్టాలు పడుతుంది. ఐతే, ఎంత చెట్టుకు అంతే గాలి అన్నట్టు రీతూ వర్మ రేంజ్ మాత్రం పెరగడం లేదు.