Ritu Chaudhary: జబర్దస్త్ కమెడియన్ రీతూ చౌదరి సడన్ షాక్ ఇచ్చింది. పెళ్లి చేసుకుంటున్న వీడియో షేర్ చేసింది. దీంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. జబర్దస్త్ లో లేడీ కమెడియన్ గా పాప్యులర్ అయ్యింది రీతూ చౌదరి. కెరీర్ బిగినింగ్ లో రీతూ చౌదరి సీరియల్స్ లో నటించారు. అక్కడ లాభం లేదని జబర్దస్త్ ఎంట్రీ ఇచ్చింది. లేడీ కమెడియన్ గా స్కిట్స్ చేసింది. పలువురు టీమ్ లీడర్స్ తో పని చేసింది. జబర్దస్త్ కొంతలో కొంత ఆమెకు ఫేమ్ తెచ్చింది.
ఇక ఇంస్టాగ్రామ్ వేదికగా రీతూ చౌదరి గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తుంది. ఆమె బోల్డ్ ఫోజెస్ వైరల్ అవుతూ ఉంటాయి. కాగా కొన్నాళ్ల క్రితం రీతూ చౌదరి ఓ వ్యక్తిని లవర్ గా పరిచయం చేసింది. అతని పేరు శ్రీకాంత్. ఆయనతో రీతూ చౌదరికి వివాహమంటూ ప్రచారం జరిగింది. అనంతరం కొన్నాళ్ల పాటు శ్రీకాంత్ కి దూరంగా ఉంది. ఇటీవల ఆన్లైన్ చాట్ లో శ్రీకాంత్ ని ప్రేమిస్తున్నారా? బ్రేకప్ అయ్యారా? ని అభిమానులు అడిగితే అస్పష్టంగా సమాధానం చెప్పింది.
పెళ్లి ఎప్పుడని అడగ్గా… నాకు పెళ్లి ఆలోచన లేదు. ప్రజెంట్ సింగిల్ అంటూ చెప్పుకొచ్చింది. దీంతో శ్రీకాంత్ తో బ్రేకప్ అయ్యిందని అందరూ భావించారు. కట్ చేస్తే శ్రీకాంత్ తో దిగిన ఫోటో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసి షాక్ ఇచ్చింది. సింగిల్ అంటూ ఆయనతో సన్నిహితంగా ఉన్న ఫోటో పెట్టడం వెనుక ఆంతర్యం ఏమిటో ఫ్యాన్స్ కి అర్థం కాలేదు. సడన్ గా పెళ్లి వీడియో పోస్ట్ చేసి మరో షాక్ ఇచ్చింది.
పెళ్లి కూతురుగా అభ్యంగ స్నానం చేసింది రీతూ చౌదరి. హల్దీ వేడుకలో మెరిసిపోయింది. దీంతో రీతూ చౌదరికి పెళ్ళని జనాలు ఫిక్స్ అయ్యారు. అయితే కామెంట్ చదివి అసలు విషయం తెలుసుకున్నారు. సదరు పెళ్లి వీడియోకి రీతూ చౌదరి… ఆన్ స్క్రీన్ మ్యారేజెస్ క్రేజీగా ఉంటాయి కదా అని కామెంట్ పెట్టింది. దాంతో ఇది నిజమైన పెళ్లి వీడియో కాదు, ఏదో షూటింగ్ లో భాగమని తేలిపోయింది. కాగా ఇటీవల రీతూ చౌదరి తండ్రి కన్నుమూశారు. రీతూ చౌదరి బాగా ఎమోషనల్ అయ్యింది.