Shyam Singaray: రాహుల్ సంకృత్యాన్ దర్శత్వంలో నాని హీరోగా వస్తోన్న సినిమా శ్యామ్ సింగరాయ్. 1970ల కాలం నాటి కలకత్తా బ్యాక్డ్రామ్లో హై వోల్టేజ్ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో సాయి పల్లవి, కృతీ శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. డిసెంబర్ 24న చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. కాగా, ఇప్పటికే రిలీజ్ దగ్గర పడుతుండటం వల్ల.. వరుసగా పోస్టర్లు, ప్రోమోలతో ప్రేక్షకులకు సినిమాపై అంచనాలు పెంచుకున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ‘రైజ్ ఆఫ్ శ్యామ్’ సాంగ్ ప్రోమో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.
తాజాగా, శనివారం రైజ్ ఆఫ్ శ్యామ్ ఫుల్ లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. ‘శ్యామ్ సింగ రాయ్.. ఎగసిపడే అలజడివాడే.. తిరగబడే సంగ్రామం వాడే.. వెనకబడని చైతన్యం వాడే’’ అంటూ ఈ సినిమాలో నాని పాత్ర స్వభావాన్ని ఆవిష్కరిస్తూ ఈ పాట సాగిపోయింది. ఈ పాట విన్న ప్రేక్షకుల నుంచి మంచి ఆదరన లభించింది. మిక్కీ జే మేయర్ స్వారాలు అందించిన ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించగా.. విశాల్ దద్లాని, అనురాగ్ కులకర్ణి ఆలపించారు. ఇటీవల ఈ సినిమా హీరోయిన్ల పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేయగా.. అందులో సాయిపల్లవి పాత్ర ఎంతో ఆకర్శనీయంగా కనిపించింది. కాగా, సాయి పల్లవి ఇందులో అతీత శక్తులున్న పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఏదేమైనా వి, టక్ జగదీశ్ సినిమాలతో పెద్దగా హిట్ కొట్టని నాని.. ఈ సినిమాతోనైనా ప్రేక్షకుల మనసు దోచుకుంటాడో లేదో తెలియాలంటే విడదల వరకు వేచి చూడాల్సిందే.