వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి ఎవరు ఏమనుకుంటారో అనే భయం లేదు. ఆ మాటకొస్తే ఈ ప్రపంచంతో తనకు సంబంధం లేదు. ముఖ్యంగా పక్కోడు ఎదురింటోడు ఫీలింగ్స్ గురించి ఆర్జీవీ పట్టించుకోడు. సాధారణ మనిషిలా సతమవుతూ బతకడం ఆర్జీవీకి అసలు చేతకాదు. ఏది ఏమైనా ఆర్జీవీ అంటేనే డిఫరెంట్, వర్మ ఆలోచనా విధానమే ఓ వెరైటీ. అందుకే వర్మ ఏం చేసినా మనకు ప్రత్యేకంగానే ఉంటుంది.
భారతీయ సినిమాకి కొత్త గ్రామర్ నేర్పిన వర్మ, గత కొన్ని సంవత్సరాలుగా సినిమాల కంటే కూడా వివాదాస్పద వ్యాఖ్యలతోనే వార్తల్లో ఫేమస్ అవుతూ వస్తున్నాడు. ఒకప్పుడు వర్మ నుండి ఇంటర్వ్యూ తీసుకోవడానికి జర్నలిస్ట్ లకు చాల కష్టం అయ్యేది. కానీ, ఇప్పుడు తానే పిలిచి మరీ ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. పైగా ప్రతి ఇంటర్వ్యూలో ఏదో ఒక సంచలన కామెంట్ చేసి రచ్చ చేయడం బాగా అలవాటు చేసుకున్నాడు.
అయితే వర్మ తాజాగా తన చావు గురించి చేసిన కామెంట్స్ అందర్నీ ఆలోచనలో పడేస్తున్నాయి. వర్మ మాటల్లోనే.. ‘పుట్టిన జీవి చనిపోవడం అనేది చాలా కామన్. సో.. చావు గురించి భయపడుతూ బాధ పడుతూ ఉండటం వేస్ట్. నాకు కూడా చావు ఎప్పుడైనా వస్తుంది, కాబట్టి ఏదైనా అణుబాంబు పేలుతున్న సమయంలో నేను దాన్ని చూస్తూ చనిపోవాలి’ అణుబాంబు పేలుడును ఏ ఒక్కరు చూడలేరు.
కానీ అది ఎలా పేలుతుంది అనే విషయాన్ని నేను చూడాలనుకుంటున్నాను’ అని ఆర్జీవీ చెప్పుకొచ్చాడు. ఆర్జీవీ కోరిక తీరుతుందో లేదో తెలియదు గాని, ఆర్జీవీ కోరిక విని మాత్రం చాలామంది ఆశ్చర్యపోతున్నారు. నిన్నటి వరకు ‘మా’ ఎన్నికల పై తనదైన ట్వీట్లు చేసి వార్తల్లో వైరల్ అయ్యాడు. ఇక ఈ రోజు ఆ వార్త పాతది అయింది అనుకున్నాడో ఏమో.. మొత్తానికి కొత్త కామెంట్స్ తో సోషల్ మీడియాలో హడావుడి మొదలు పెట్టాడు.