RGV and Sandeep Reddy Vanga: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి పాపులారిటీ ని సంపాదించుకున్న దర్శకులలో రాంగోపాల్ వర్మ ఒకరు… ఇక ఈయన చేసిన సినిమాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటివరకు ఆయన ఎన్ని సినిమాలు చూసిన కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ వస్తున్నాడు… గత కొన్ని రోజుల నుంచి ఆయన చేసిన సినిమాలు ఏ మాత్రం ప్రేక్షకులను మెప్పించకపోయిన ఆయనకున్న క్రేజ్ ను కాపాడుకుంటున్నాడు. ఇక ఇదిలా ఉంటే జీ లో చేస్తున్న ‘జయమ్మూ నిశ్చయమ్మురా’ అని షో కు తను గెస్ట్ గా వచ్చాడు. ఇక తనతో పాటు సందీప్ రెడ్డివంగ ను కూడా తోడు తెచ్చుకున్నాడు… ఇక వీళ్ళిద్దరూ కలిసి చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇక ఈ ఎపిసోడ్ చూడటానికి చా మంది ప్రేక్షకులు ఆసక్తి ఎదురు చూస్తున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… సందీప్ రెడ్డి వంగ, ఆర్జీవీ ల మధ్య చాలాసేపు చాలా కన్వర్జేషన్ అయితే నడిచింది. ఇక రీసెంట్ గా రిలీజ్ చేసిన ప్రోమో లో అయితే రామ్ గోపాల్ వర్మను సందీప్ మనిద్దరం క్లాస్మేట్స్ అయితే ఎలా ఉంటది సార్ అని అడగగా రాంగోపాల్ వర్మ దానికి ఫన్నీ గా ఆన్సర్ చెప్పాడు.
మనిద్దరం క్లాస్మేట్స్ అయితే బాగుండేది అనగానే ఆర్జీవీ అందులో ఒకరు గర్ల్ అయితే ఇంకా బాగుంటుంది అంటూ సోషల్ మీడియాలో ఆయన మాట్లాడిన మాటలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నిజానికి సందీప్ రెడ్డి వంగ పాన్ ఇండియాలో వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్ గా భారీ గుర్తింపును సంపాదించుకునే ప్రయత్నంలో చాలా బిజీగా ఉన్నాడు.
ఇక ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు ఆయన చేస్తున్న హిట్ సినిమాకి సంబంధించిన కొన్ని విషయాలను కూడా ఈ షో లో పంచుకున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ షో టెలికాస్ట్ అయితే గాని ఈ షోలో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు.అలాగే వాళ్ళు ఏ రేంజ్ లో ప్రేక్షకుడిని ఎంటర్టైన్ చేశారు అనే దాని మీద ఒక క్లారిటీ అయితే రాదు…
ఇక మొత్తానికైతే సందీప్ తన గురువుగా భావించే రాంగోపాల్ వర్మ పక్కన కూర్చుని చేసిన సందడి చూడాలంటే మాత్రం షో టెలికాస్ట్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…ఇక ఏది ఏమైనా కూడా ఈ షో ప్రస్తుతం టాప్ రేంజ్ లో ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఇప్పటివరకు ఎన్ని టాక్ షో లు వచ్చినా కూడా జగపతి బాబు హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో మాత్రం నెక్స్ట్ లెవెల్లో నిలువబోతున్నట్టుగా తెలుస్తోంది…