
వివాదం ఉన్నచోట రామ్ గోపాల్ వర్మ ఉంటాడు.. వివాదం లేకపోతే.. తానే క్రియేట్ చేస్తాడు. ఆ తర్వాత ‘‘నేనేమన్నాను.. నా డౌట్ ఎక్స్ ప్రెస్ చేశాను.’’ అంటాడు. ఇలా నిత్యం వివాదాలతో సావాసం చేసే వర్మ.. తాజాగా సంచలన ట్వీట్ చేశాడు. జూనియర్ ఎన్టీఆర్-అఖిల్ అక్కినేనిపై నాన్ వెజ్ కామెంట్ చేసి వివాదం రాజేశాడు.
ఏదో సినిమా ఫంక్షన్లో ఎన్టీఆర్ – అఖిల్ పక్కపక్కన కూర్చొని ఉన్న వీడియోను పోస్టు చేశాడు. ఈ వీడియోలో.. అఖిల్ తొడను సరదాగా గిల్లాడు జూనియర్. దీంతో.. ఎన్టీఆర్ చేయి తీసేశాడు అఖిల్. కాసేపటి తర్వాత మరోసారి అదే పనిచేశాడు తారక్. ఈ సారి కూడా నెట్టేశాడు అఖిల్. ఈ వీడియో పోస్టు చేసిన ఆర్జీవీ.. వివాదాస్పద కామెంట్ చేశాడు. ‘ఇక హీరోయిన్ల భవిష్యత్ ప్రమాదంలో పడినట్టే’’ అంటూ ద్వందార్థం వచ్చేలా కామెంట్ జత చేశాడు.
ఆ తర్వాత మరో ట్వీట్ కూడా చేశాడు. నారా లోకేష్ జనాలతో సెల్ఫీ దిగుతున్న ఫొటో పోస్టు చేశాడు. దానికి.. ‘‘అక్కడ ఎన్టీఆర్-అఖిల్ లవ్ స్టోరీ అలా ఉంటే.. ఇక్కడ ఎదుటనే లేడీస్ ఉండగా.. సెల్ఫీ లవ్ లోనే ఉన్నాడంటే.. ఇది స్త్రీ జాతికి ముగింపా? జస్ట్ ఆస్కింగ్’’ అంటూ కామెంట్ చేశాడు.
ఈ ట్వీట్లపై జూనియర్, అఖిల్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ‘రెండు పెగ్గులు వేయగానే ఏదిపడితే అది వాగేస్తావు. నీ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అని రిప్లే ఇస్తున్నారు ఫ్యాన్స్. ఇలాంటి పైత్యం తగ్గించుకుంటే మంచిదని సూచిస్తున్నారు.
Am feeling so sad for heroines😢😢😢😫😫😫 pic.twitter.com/cK64qdQi4n
— Ram Gopal Varma (@RGVzoomin) April 8, 2021