
RGV and Ashu Reddy: ఏ కామెంట్ చేస్తే.. జనాలు అలర్ట్ అవుతారు? ఏ ఫొటో వదిలితే.. నెటిజన్స్ రియాక్ట్ అవుతారు? అన్నది రామ్ గోపాల్ వర్మకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదేమో? ట్వీట్ చేసినా.. వీడియో వదిలినా.. అసలు ఆర్జీవీ ఏం చేసినా.. అది వార్త అయ్యి తీరుతోంది. ఇది పసిగట్టిన బ్యూటీస్.. ‘‘మమ్మల్ని ఫేమస్ చేసి పెట్టవా?’’ అని అడుగుతున్నారు. ‘‘దానికేం భాగ్యం తప్పకుండా..’’ అంటూ వాళ్లతో రచ్చ చేసి వదులుతున్నాడు ఆర్జీవీ (RGV). అలాంటి రచ్చకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఇవాళ సాయంత్రం విడుదల కాబోతోంది.
డబ్ స్మాష్ వీడియోలతో రచ్చచేసి.. పవర్ స్టార్ లేడీ వీరాభిమానిగా ఫేమస్ అయిన అషూ రెడ్డి(Ashu Reddy).. ఇప్పుడు ఆర్జీవీ చెంతకు చేరిన సంగతి తెలిసిందే. అరియానా బోల్డ్ ఇంటర్వ్యూ తర్వాత.. అషూతోనూ ఇంటర్వ్యూ ప్లాన్ చేశాడు ఆర్జీవీ. ఈ క్రమంలోనే.. ఆర్జీవీ-అషూ ఐస్ క్రీమ్ పార్లర్ కు వెళ్లారు. అక్కడ అషూను ఫుల్ ఎక్స్ పోజ్ చేస్తూ వివిధ భంగిమల్లో ఫొటో తీశాడు ఆర్జీవీ. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
అప్పుడు తీసిన ఫొటోలను ఒక్కొక్కటిగా వదులుతున్నాడు వర్మ. రెండు రోజుల క్రితం అషూ మరింత హాట్ గా ఉండే ఫొటోలను రిలీజ్ చేశాడు. ఇప్పుడు లేటెస్ట్ గా అలాంటి ఫొటోనే ఒకటి త్రో చేశాడు. అంతేకాదు.. ఆ ఫొటో షూట్ సమయంలో తాము ఏం మాట్లాడుకున్నామో కూడా చెప్పేశాడు ఆర్జీవీ. ఇంకేముందీ.. సోషల్ మీడియాలో రచ్చ నడుస్తోంది.
ఇంతకీ.. ఏం చెప్పాడంటే.. అషూరెడ్డి, ఆర్జీవీ ఇద్దరూ కలిసి అక్కడ ఐస్ క్రీమ్ తింటూ.. శృంగారం గురించి మాట్లాడుకున్నారట! ఇక, ఇవాళ సాయంత్రం (ఆగస్టు 30) 6 గంటల 9 నిమిషాలకు అషూ ఇంటర్వ్యూకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేస్తున్నాడట. అందరూ ఖచ్చితంగా చూసి ఎంజాయ్ చేయాలని అంటున్నాడు. ప్రస్తుతం వర్మ తీసిన ఫొటోతోపాటు ఆయన స్టేట్ మెంట్ కూడా వైరల్ అవుతోంది. మరి, సాయంత్రం ఇంటర్వ్యూ ఫస్ట్ లుక్ వదిలిన తర్వాత ఇంకెంత రచ్చ జరుగుతుందో చూడాలి.