Retro Collection: తమిళ హీరో సూర్య(Suriya Sivakumar) నటించిన లేటెస్ట్ చిత్రం ‘రెట్రో'(Retro Movie) ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే ఫ్లాప్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం లో ఒక సినిమా వస్తుందంటే ఆ చిత్రం పై కచ్చితంగా ప్రేక్షకుల్లో కొన్ని అంచనాలు ఉంటాయి. ఎందుకంటే ఆయన సినిమాలు ఒక సరికొత్త థియేట్రికల్ అనుభూతిని కలిగిస్తూ ఉంటాయి కాబట్టి. వరుస ఫ్లాప్స్ లో ఉన్న సూర్య కి ఈ చిత్రం కచ్చితంగా కం బ్యాక్ చిత్రం గా నిలుస్తుందని భావించారు. కానీ థియేట్రికల్ ట్రైలర్ ని చూసినప్పుడు ఆడియన్స్ కి కాస్త తేడా కొట్టింది. ఏమిటి ఈ గజిబిజి గందరగోళం, సినిమా కూడా ఇలాగే ఉంటుందా అని అనుకున్నారు. కానీ ఎక్కడో కార్తీక్ సుబ్బరాజ్ మీద ఆడియన్స్ కి ఒక నమ్మకం ఉంది.
Also Read: సూర్య కూతురు ఇంటర్ మార్కుల పట్టిక చూసారా..? దిమ్మతిరగడం ఖాయం!
ఫలితంగానే ట్రైలర్ వికటించినప్పటికీ ఓపెనింగ్ వసూళ్లు భారీగానే వచ్చాయి. కేవలం ఓపెనింగ్స్ మాత్రమే కాదు, లాంగ్ రన్ లో కూడా డీసెంట్ స్థాయి వసూళ్లను రోజురోజుకూ నమోదు చేసుకుంటూ ముందుకెళ్లింది ఈ చిత్రం. ఫలితంగా 9 రోజులకు గానూ ఈ చిత్రానికి 90 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ వీకెండ్ తో వంద కోట్ల గ్రాస్ మార్కుని కూడా ఈ చిత్రం అందుకునే అవకాశాలు ఉన్నాయి. ఫ్లాప్ టాక్ తో ఇంత దూరం ఒక సినిమా రావడం అనేది చిన్న విషయం కాదు. ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే తమిళనాడు నుండి ఈ చిత్రానికి 9 రోజుల్లో 44 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఫుల్ రన్ లో కచ్చితంగా 50 కోట్ల మార్కుని ఈ చిత్రం అందుకుంటుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. అదే విధంగా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 7 కోట్ల 35 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
కర్ణాటక రాష్ట్రం నుండి 10 కోట్ల 65 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, కేరళ నుండి 4 కోట్ల 45 లక్షలు, హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి కోటి 40 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక ఓవర్సీస్ నుండి ఈ చిత్రానికి 9 రోజులకు 22 కోట్ల 60 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి 90 కోట్ల 45 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 45 కోట్ల 25 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని క్లీన్ హిట్ స్టేటస్ కి చేరాలంటే మరో 36 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. అది దాదాపుగా అసాధ్యమే అని అనుకోవచ్చు. ఇకపోతే బుక్ మై షో యాప్ లో నిన్నటితో ఈ చిత్రం పది లక్షలకు పైగా టికెట్స్ సేల్ అయిన సినిమాగా నిల్చింది.