Republic Movie Collections: మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ రిపబ్లిక్ సినిమా చుట్టూ రగులుకున్న వివాదాలు ఇంకా ముదురుగుతూనే ఉన్నాయి. ఈ మధ్యలో ఈ సినిమా రిలీజ్ అయింది. ప్రస్థానం, ఆటోనగర్ సూర్య లాంటి చిత్రాలతో ఆకట్టుకున్న దేవ కట్టా దర్శకత్వంలో వచ్చిన సినిమా కాబట్టి.. ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ పరిస్థితి ఏమిటో చూద్దాం. ముందుగా ఈ సినిమాకి బిజినెస్ బాగానే జరిగింది. ఏపీ తెలంగాణలో మొత్తం 13 కోట్ల మేర బిజినెస్ చేసింది ఈ సినిమా.

ముఖ్యంగా నైజాం, ఆంధ్రాలోని పలు జిల్లాల థియేటర్ రైట్స్ ఫ్యాన్సీ రేటుకు అమ్మారు. రిపబ్లిక్ సినిమా బిజినెస్ బాగా జరగడంతో ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది కూడా, ఇలాంటి జోనర్ సినిమాలకు బిజినెస్ జరగడం ఆశ్చర్యమే అన్నారు. పైగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ సినిమా భారీగా బిజినెస్ చేసుకుంది.
మొత్తమ్మీద ఈ సినిమా 14.5 కోట్ల టార్గెట్ తో బాక్సాఫీస్ పై యుద్దానికి సిద్ధం అయింది. ఏపీలో దాదాపు 300కు పైగా థియేటర్లలో, నైజాంలో సుమారు 300 థియేటర్లలో విడుదల అయింది ఈ చిత్రం. ఇక ప్రపంచవ్యాప్తంగా 750 స్క్రీన్లలో విడుదల అయింది. మరి రిలీజ్ పరంగా భారీ స్థాయిలో రిలీజ్ చేశారు. మరి కలెక్షన్స్ పరంగా ఏ స్థాయిలో వచ్చాయో చూద్దాం.
ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో రాలేదు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓ మోస్తారుగా మాత్రమే నమోదయ్యాయి. మొదటి రోజు కలెక్షన్లు రూ.2 కోట్ల మేరకు వచ్చాయి. ఈ వసూళ్లను బట్టి.. రిపబ్లిక్ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించలేదనే అనుకోవాలి.
కారణం ఆంధ్ర ప్రదేశ్‌లో అత్యంత పాపులారిటి ఉన్న కొల్లేటి మంచినీటి సరస్సు ఎలా ఉప్పునీటి సరస్సుగా మారిందనే కోణంలో ఈ సినిమా సాగుతుంది. ఈ సమస్య పైనే సినిమా మొత్తం నడవడం.. సినిమాలో ఎలాంటి కమర్షియల్ అంశాలు లేకపోవడం ఈ సినిమాకి మైనస్ అయ్యాయి.