Renu Desai: రేణు దేశాయ్ కమ్ బ్యాక్ ఇచ్చారు. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఏళ్ల అనంతరం రేణు దేశాయ్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించారు. రవితేజ హీరో విడుదలైన టైగర్ నాగేశ్వరరావు మూవీలో రేణు దేశాయ్ కీలక రోల్ చేశారు. ఆమె సామాజిక కార్యకర్త హేమలత లవణం పాత్ర చేశారు. టైగర్ నాగేశ్వరరావుతో పాటు దొంగలుగా ఉన్న స్టూవర్టుపురం ప్రజల జీవితాల్లో మార్పులు తెచ్చేందుకు కృషి చేసిన హేమలత లవణం పాత్ర చేశారు.
ఇది నిజ జీవిత పాత్ర కాగా… హేమలత లవణం బంధువులను రేణు దేశాయ్ షూటింగ్ సమయంలో కలిశారు. ఆమె గురించి అనేక విషయాలు అడిగి తెలుసుకున్నారు. టైగర్ నాగేశ్వరరావు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అందుకే రేణు దేశాయ్ పాత్ర పెద్దగా పాప్యులర్ కాలేదు. రేణు దేశాయ్ ఫ్యాషన్ డిజైనర్ కూడాను. గతంలో ఆమె పవన్ కళ్యాణ్ సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేశారు.
చిత్ర నిర్మాణం, దర్శకత్వంలో కూడా ఆమెకు ఆసక్తి ఉంది. తన వద్దకు కొన్ని స్క్రిప్ట్స్ ఉన్నాయి. వాటికి దర్శకత్వం వహిస్తానని రేణు దేశాయ్ గతంలో చెప్పారు. అయితే ఆమె నిర్మాతగా మారారు అనేది తాజా న్యూస్. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థలలో ఒకటిగా ఉన్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో ఆమె చేతులు కలిపారట. ఈ సంస్థతో పాటు భాగస్వామిగా ప్రాజెక్ట్స్ తెరకెక్కించనున్నారట. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఆఫీస్ లో రేణు దేశాయ్ కి స్పెషల్ క్యాబిన్ కూడా ఏర్పాటు చేశారట.
మంచి రోజు చూసుకుని క్యాబిన్ లో రేణు దేశాయ్ అడుగుపెట్టారట. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ పవన్ కళ్యాణ్ కి అత్యంత సన్నిహితుడు. వీరి కాంబోలో ఇటీవల బ్రో విడుదలైంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రభాస్ హీరోగా రాజా డీలక్స్ మూవీ నిర్మిస్తున్నారు. మరికొన్ని ప్రాజెక్ట్స్ వారి ఖాతాలో ఉన్నాయి. తాజాగా రేణు దేశాయ్ వారితో చేతులు కలిపారని వార్తలు వస్తున్నాయి. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు.