Renu Desai: తెలుగు సినిమా ఇండస్ట్రీలో రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎందుకంటే ఆయన ఇప్పటికే చాలా సినిమాలు చేసి వరుసగా సక్సెస్ లు అందుకొని ఇండస్ట్రీ లో స్టార్ హీరో గా ఎదిగాడు.ఇక ఇలాంటి క్రమంలో ప్రస్తుతం ఆయన స్టువర్ట్ పురం దొంగ టైగర్ నాగేశ్వరరావు అనే ఒక రియల్ స్టోరీ ని బేస్ చేసుకుని ఒక సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో నటిస్తున్న అలనాటి మేటి హీరోయిన్ అలాగే పవన్ కళ్యాణ్ మాజీ భార్యఅయిన రేణు దేశాయ్ కూడా ఒక కీలకపాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమాకి నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ లు హీరోయిన్స్ గా చేస్తున్నారు. ఈ సినిమాని అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. అలాగే ఈ సినిమాకి వంశీ కృష్ణ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు.
ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.దాంట్లో భాగంగానే చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రమోషన్స్ ని చేస్తున్నారు.ఆ ప్రమోషన్స్ లో భాగంగానే రేణు దేశాయి కూడా పాల్గొనడం అందులో తన కొడుకు అయిన అకిరా నందన్ గురించి మాట్లాడం జరిగింది.అకిరా గురించి మాట్లాడుతూ వాడికి ప్రస్తుతం హీరో అవ్వాలనే కోరిక లేదు.ఒకవేళ అలాంటి ఉద్దేశ్యం ఉంటే తనే ముందుగా అతనిని ఎంకరేజ్ చేస్తానని కూడా చెప్పింది. అలాగే తను హీరో అవ్వాలనే ఇంట్రెస్ట్ పెట్టుకోకుండా పియానో నేర్చుకున్నాడు. అలాగే తనే స్వయంగా ఒక స్క్రిప్ట్ కూడా రాసుకున్నాడు.నిజానికి ఒక కొడుకుని సిల్వర్ స్క్రీన్ మీద చూడాలని ప్రతి తల్లికి ఉంటుంది నాకు కూడా అలాగే ఉంది.కాని వాడికి ఇంట్రెస్ట్ లేనప్పుడు మనం ఫోర్స్ చేయలేం కదా అంటూ చెప్తూనే వాడికి ఒక వేళ హీరో అవ్వాలనే ఇంట్రెస్ట్ ఉంటే వాడు ప్రత్యేకంగా నటన నేర్చుకోవాల్సిన పని ఏం లేదు. ఎందుకంటే నేను నటినే, వాళ్ల నాన్న కూడా మంచి నటుడే కాబట్టి స్వతహాగా వాడి జీన్స్ లోనే నటన అనేది ఉంది.
ఇక వాడు హీరోగా చేస్తాను అంటే తప్పకుండా హీరోగా పరిచయం చేస్తాను.అంతేతప్ప వాడి మీద నా ఇష్టాలను రుద్దాను అని చెప్పింది.అలాగే ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా లో తను చేసిన క్యారెక్టర్ బడుగు బలహీన వర్గాలను ఆదరించే ఒక మంచి క్యారెక్టర్ అంటూ చెప్పుకొచ్చారు.అలాగే తను చాలా రోజుల తర్వాత సినిమాలో నటించడం అనేది చాలా కొత్తగా ఉందని చెప్తూనే సెట్స్ లో అందరూ నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారు అని చాలా భయపడ్డాను కానీ సినిమా యూనిట్ మొత్తం తనని ఒక ఫ్యామిలీ మెంబర్ల చాలా బాగా చూసుకున్నారు అంటూ చెప్పింది. అలాగే మంచి క్యారెక్టర్ దొరికితే ముందు ముందు ఇంకా మంచి సినిమాల్లో చేయాలని ఉంది అంటూ ఆమె అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు…