Homeఎంటర్టైన్మెంట్Renu Desai: ఆయనే నన్ను వదిలేశాడు... కోపంలో పవన్ కళ్యాణ్ ప్రైవేట్ మేటర్ వెలుగులోకి తెచ్చిన...

Renu Desai: ఆయనే నన్ను వదిలేశాడు… కోపంలో పవన్ కళ్యాణ్ ప్రైవేట్ మేటర్ వెలుగులోకి తెచ్చిన రేణు దేశాయ్!

Renu Desai: రేణు దేశాయ్-పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వార్ నడుస్తూనే ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేసే కామెంట్స్ ఆమెకు నచ్చవు. కొన్నేళ్ళు పవన్ కళ్యాణ్ కి చాలా దూరంగా బ్రతికింది రేణు దేశాయ్. విడాకుల అనంతరం పూణేలో పిల్లలతో పాటు ఒంటరిగా జీవించింది. ఓ మూడేళ్ళ క్రితం హైదరాబాద్ వచ్చారు. పవన్ కళ్యాణ్ పిల్లలు అకీరా, ఆద్యలతో సన్నిహితంగా ఉంటున్నారు. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచారు. డిప్యూటీ సీఎంగా, మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు కూడా చెప్పింది రేణు దేశాయ్.

అయితే ఓ నెటిజెన్ చేసిన కామెంట్ ఆమెను ఆగ్రహానికి గురి చేసింది. అతడి పై ఫైర్ అయ్యింది. పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఒకరు ”వదిన గారు మీరు ఇంకొన్ని ఇయర్స్ ఓపిక పట్టి ఉంటే బాగుండేది. దేవుడిని పెళ్లి చేసుకుని ఆయన అంతరంగం తెలియకుండా వెళ్లిపోయారు. కానీ ఈ రోజు ఆయన విలువ నీకు తెలిసింది. ఏది ఏమైనా విధి నిర్ణయం. ఈ రోజు పిల్లలు అన్నయ్యతో ఉన్నారు. అది చాలు వదిన..” అని కామెంట్ పెట్టాడు. ఇది కాస్తా వైరల్ కాగా మరికొందరు పవన్ కళ్యాణ్ అభిమానులు అతనికి మద్దతుగా కామెంట్స్ పోస్ట్ చేశారు.

Also Read: RGV Heroine: భక్తి బాట పట్టిన ఆర్జీవీ హాట్ హీరోయిన్.. ఇది ఊహించని మార్పు!

దాంతో రేణు దేశాయ్ ఆగ్రహానికి గురైంది. మీకు కొంచెం అయినా బుద్ధి ఉంటే ఇలా అనేవారు కాదు. ఆయనే నన్ను వదిలేసి వేరే పెళ్లి చేసుకున్నారు. నేను కాదు. దయచేసి ఇలాంటి కామెంట్స్ చేసి నన్ను ఇంకా టార్చర్ చేయవద్దు… అని సమాధానం ఇచ్చింది. మరొక నెటిజెన్… సూపర్ అమ్మ, మీరు అన్న దగ్గర లేకపోయినా పూజలు చేస్తున్నారు. అని కామెంట్ చేశాడు. ఈ కామెంట్ కి కూడా రేణు దేశాయ్ స్పందించారు.

Also Read: Star Director: ఆ బ్యానర్ ను నమ్ముకొని ఇబ్బందుల్లో పడ్డ స్టార్ డైరెక్టర్…

అన్న దగ్గర లేకపోయినా అంటే అర్థం ఏమిటీ? నాకు సొంత లైఫ్ ఉండదా? అని కౌంటర్ వేసింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రేణు దేశాయ్ ని అనవసరంగా రెచ్చగొడుతున్నారు. కోపంలో ఆమె పవన్ కళ్యాణ్ ప్రైవేట్ లైఫ్ గురించి కామెంట్స్ చేస్తుంది. గత కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో ఈ రచ్చ కొనసాగుతూనే ఉంది. కాగా ఇటీవల రేణు దేశాయ్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు మూవీలో ఆమె కీలక రోల్ చేశారు.

RELATED ARTICLES

Most Popular