Geetu Elimination Episode: తెలుగు ప్రేక్షకులు బుల్లితెర లో ఎంతో ఆసక్తితో చూసే ఏకైక రియాలిటీ షో బిగ్ బాస్..అన్ని వర్గాల ప్రేక్షకులను సమానంగా అలరించే ఈ షో ఇప్పటి వరుకు 5 సీజన్స్ ని పూర్తి చేసుకొని, ఆరవ సీజన్ లోకి అడుగుపెట్టింది..అయితే గడిచిన సీజన్స్ తో పోలిస్తే ఈ సీజన్ పెద్ద సక్సెస్ కాదనే చెప్పాలి..కానీ గత కొద్ది రోజుల నుండి టాస్కులు ఆసక్తికరంగా ఉండడం తో TRP రేటింగ్స్ పెరుగుతూ వచ్చింది..హౌస్ మేట్స్ అందరూ టాస్కులు సీరియస్ గా తీసుకొని కసిగా కలబడి ఆడడం వల్లే రేటింగ్స్ మెరుగుపడ్డాయి.

రేటింగ్స్ ఎక్కువగా కంటెంట్ ఉంటేనే వస్తుంది..ఆ కంటెంట్ ఇప్పుడున్న హౌస్ మేట్స్ లో అందరికంటే ఎక్కువ ఇచ్చింది గీతూ అనే చెప్పాలి..ప్రతి టాస్కులోను ఈమె గేమ్ చెంజర్ గా ఉంటూ వస్తుంది..అలాంటి కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వడం ఇంటి సభ్యులతో పాటుగా ప్రేక్షకులను కూడా షాక్ కి గురి చేసింది..ఇక గీతూ ఎలిమినేషన్ ఎపిసోడ్ కి సీజన్ 6 లో ప్రసారమైన అన్ని ఎపిసోడ్స్ కంటే ఎక్కువ TRP రేటింగ్స్ వచ్చినట్టు సమాచారం.
సీజన్ 6 ప్రారంభం ఎపిసోడ్ కి కేవలం 7 టీఆర్ఫీ రేటింగ్స్ మాత్రమే వచ్చాయి..ఇది బిగ్ బాస్ చరిత్రలోనే అతి తక్కువ రేటింగ్స్ అని చెప్పొచ్చు..వీక్ డేస్ లో ప్రసారమయ్యే టీఆర్ఫీ రేటింగ్స్ అయితే 5 లోపలే వచ్చేవి..కానీ 5 వారం నుండి మాత్రం రేటింగ్స్ పెరుగుతూ వచ్చాయి..ఇక మొన్న గీతూ ఎలిమినేట్ అయినా ఎపిసోడ్ కి అయితే ఏకంగా 14 టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చినట్టు సమాచారం..ఈ సీజన్ లో ప్రసారమైన అన్ని ఎపిసోడ్స్ కంటే డబుల్ మార్జిన్ అన్నమాట ఇది..గీతూ హౌస్ లో ఉన్నవారిలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవ్వడం తో పాటు..ఆమె ఎలిమినేట్ అవుతున్న సమయం లో ఇంటిని వదిలి వెళ్ళేటప్పుడు వెక్కి వెక్కిమరీ ఏడవడం అందరి హృదయాల్ని కలిచివేసింది.

గీతూ అంటే ఇష్టంలేని వాళ్ళు కూడా ‘అయ్యోపాపం..అవకాశం ఉంటె మళ్ళి లోపలకు పంపితే బాగుండును’ అని అనిపించేలా చేసింది ఈ ఎపిసోడ్..బిగ్ బాస్ హిస్టరీ లో ఏ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యినప్పుడు కూడా ప్రేక్షకులు ఇంతలా బాధపడలేదు..ఏ కంటెస్టెంట్ కూడా గుండెలు బాదుకుంటూ గీతూ లాగ ఏడవలేదు కూడా..అందుకే ఆ ఎపిసోడ్ కి ఆ స్థాయి టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చాయి అంటున్నారు విశ్లేషకులు.