Real Couple Entered In Bigg Boss House: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను బిగ్ రియాల్టీ షో బిగ్ బాస్ ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పటి వరకు ఐదు సీజన్లు ప్రసారమవగా… అన్ని సీజన్లు టీఆర్పీ రేటింగుల్లో దూసుకుపోయాయి. ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 కూడా అలరించడానికి సన్నద్ధం అయ్యింది. ఇప్పటికే విడుదలైన ప్రోమోలు, కొత్త లోగో బాగా ఆకట్టుకున్నాయి. మొత్తానికి ఎన్నో అంచనాల నడుమ ఆరో సీజన్ నిన్న ప్రారంభం అయింది. ఈ ప్రీమియర్ ఎపిసోడ్‌లో ఇప్పటికే పలువురు కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు.

అయితే, బిగ్ బాస్ హౌస్‌లోకి నిజమైన జంట కంటెస్టెంట్‌లు గా ఎంట్రీ ఇవ్వడమే ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. వాళ్లెవరో కాదు.. సీరియల్ నటీ నటులుగా సందడి చేసి పెళ్లి చేసుకున్న మెరీనా అబ్రహం, రోహిత్ సాహ్ని. వీరిద్దరూ ఓ రొమాంటిక్ సాంగ్ తో బిగ్ బాస్ స్టేజ్ మీదకు ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత నాగార్జున వాళ్లను లవ్ స్టోరీ చెప్పమని అడిగాడు. దీంతో తామిద్దరం ఎలా కలిశామో చెప్పారు.
తమలో తమకు మార్పులు తెలియాలని, ఛాలెంజ్‌లు ఎదుర్కోవడం ఇష్టం అని, అందుకే బిగ్ బాస్ షోలోకి వచ్చామని మెరీనా అబ్రహం, రోహిత్ సాహ్ని గర్వంగా చెప్పుకున్నారు. మరి ఈ జంట ఏ స్థాయి వరకు వెళ్తుందో చూడాలి. మూడో సీజన్‌లో వరుణ్ సందేశ్, వితిక షేరు జంటను కంటెస్టెంట్లుగా తీసుకొచ్చారు. మళ్లీ ఇన్నాళ్లకు సీరియల్ జోడీ మెరీనా అబ్రహం, రోహిత్ సాహ్నిను హౌస్‌లోకి తీసుకొచ్చారు.

మెరీనా ‘అమెరికా అమ్మాయి’, ‘ఉయ్యాల జంపాల’, ‘సిరి సిరి మువ్వ’ వంటి సీరియళ్లు చేసింది. రోహిత్ ‘నీలి కలువలు’, ‘అభిలాష’ సీరియళ్లు చేశాడు. ఇక బిగ్ బాస్ ఆరో సీజన్ విషయంలో నిర్వహకులు ఎంతో ప్రతిష్టాత్మకమైన మార్పులు చేసినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా కంటెస్టెంట్ల విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తోంది.
పైగా షో హౌస్ సెట్ వర్కును నిర్వహకులు చాలా గ్రాండ్ గా డిజైన్ చేశారు. అలాగే, స్టేజ్‌ను కూడా సుందరంగా తీర్చిదిద్దారు. మొత్తానికి ఈ ఆరో సీజన్ ఎన్నో అంచనాలతో వైభవంగా ప్రారంభం కాబోతుంది. అన్నిటికీ మించి ఈ సీజన్‌లో పాల్గొనే కంటెస్టెంట్ల విషయంలో నిర్వహకులు ఎన్నో వ్యూహాలను అమలు పరచబోతున్నారు.