spot_img
Homeఎంటర్టైన్మెంట్రవితేజానా మజాకా

రవితేజానా మజాకా

మాస్ మహారాజా రవితేజకి సినిమా రంగంలో ఆదరణ ఇంకా తగ్గలేదు. రవితేజ నటించిన సినిమాలకు ఇంకా మంచి మార్కెట్ వస్తూనే ఉంది. ఒకప్పుడు రవితేజ సినిమా అంటే….ప్లాప్ సినిమాకి కూడా బయ్యర్స్ కొన్నదానికి 10 శాతం వరకూ లాభాలు వచ్చేవి. అదే హిట్ టాక్ వస్తే ఆ లాభం 25 శాతం పైనే ఉండేది. అందుకే రవితేజను మినిమం గ్యారంటీ హీరో అనే వారు అయితే ఆ తరువాత వరుస హిట్లు రావడం తో పాటు … మార్కెట్ కూడా పెరగడంతో రెమ్యూనరేషన్ పెంచేసాడు.

దీంతో బిజినెస్ అనుకున్న స్థాయిలో అవ్వకపోవడం జరిగింది.. ఫలితంగా ‘టచ్ చేసి చూడు’ ‘నేల టిక్కెట్’ ‘అమర్ అక్బర్ ఆంటోని’ ‘డిస్కో రాజా’ వంటి చిత్రాలు డిజాస్టర్లు అయ్యాయి. అయితే ఇప్పుడు మళ్ళీ రవితేజ పాత పద్దతికి వచ్చేసాడు. రెమ్యూనరేషన్ తగ్గించుకున్నాడు… తక్కువ బడ్జెట్ లో సినిమాని పూర్తి చేయమని నిర్మాతలకి ఒకటికి రెండు సార్లు చెబుతున్నాడు. అలా తన తరువాతి చిత్రం ‘క్రాక్’ విషయంలో ఇదే ఫార్ములా అప్లై చేసాడు. ‘ఠాగూర్’ మధు నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకుడు. మే 8న విడుదల కాబోతున్న ఈ చిత్రానికి తెలుగురాష్ట్రాల్లో బిజినెస్ కూడా పూర్తయి పోయిందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని నైజాం లో 6.30 కోట్లు , సీడెడ్ లో 3.33 కోట్లు , ఆంధ్ర లో 8.50 కోట్లు వెచ్చించి బయ్యర్లు కొన్నట్లు తెలుస్తోంది

ఓవర్సీస్ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లెక్కలు తెలియాల్సి ఉంది. అవి తక్కువలో తక్కువ 2 కోట్లు అనుకున్నా… 20 కోట్ల పైనే ఈ చిత్రం బిజినెస్ చేసినట్టు అనుకోవాలి. రవితేజ గత నాలుగు సినిమాలు కనీసం 10 కోట్ల షేర్ ను కూడా రాబట్టలేకపోయినా ‘క్రాక్’ చిత్రానికి ఈ స్థాయిలో బిజినెస్ జరగడం ఆశ్చర్యం కలిగించే విషయం. గతంలో దర్శకుడు గోపీచంద్ మలినేని రవితేజ తో ‘డాన్ శీను’ ‘బలుపు’ వంటి సూపర్ హిట్ సినిమాలు తీయడం అవి డిస్ట్రిబ్యూటర్లకి మంచి లాభాల్ని అందించడం జరిగింది..
Confidence is strength

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Most Popular

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...

NTR: కీలక నిర్ణయం దిశగా జూనియర్ ఎన్టీఆర్!

NTR: తెలుగుదేశంలో చంద్రబాబు తర్వాతే ఎవరూ అంటే మాత్రం చటుక్కున లోకేష్ పేరు వస్తుంది. ప్రస్తుతం ఆయన అనధికార అధినేత తెలుగుదేశం పార్టీకి. పైగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో అన్ని తానై...

Tammineeni Seetharam: ఏపీలో మారిన అరెస్టుల స్టైల్!

Tammineeni Seetharam: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు అరెస్టు భయం వెంటాడుతోంది. ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం కేసుల రూపంలో వెంటాడింది. కానీ కొందరు తమ వ్యవహార శైలితో ఏరి కోరి కేసులు తెచ్చుకున్నారు....

Ram Gopal Varma: ఆ హీరోను చంపేస్తా…ఆర్జీవీ కి చెప్పిన ఫ్యాక్షనిస్టు…వైరల్ వీడియో…

Ram Gopal Varma: 'శివ' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ దశాదిశా మార్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ...అప్పటి వరకు తెలుగు సినిమాలు అంటే ఒక మూస ధోరణి కథలతో సాగేవిగా ఉండేవి...కానీ...

YSRCP: వైసీపీలో కాపు నేతల తిరుగుబాటు!

YSRCP: కాపు అస్త్రంతో కూటమిని చీల్చాలని జగన్మోహన్ రెడ్డి భావించారు. ఇప్పుడు అదే కాపు అస్త్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గుచ్చుకోబోతోంది. కూటమిని ఇరకాటంలో పెట్టేందుకు, కాపు ఓటు బ్యాంకు ను ఆకట్టుకోవడానికి...
Oktelugu Epaper
Exit mobile version