Ravi teja – Nikhil: రవితేజతో నిఖిల్.. హిట్ కొడతారా ?

Ravi teja – Nikhil: ‘నిఖిల్’ కెరీర్ లో చాలా స్పీడ్ గా ఎదిగాడు, ప్రస్తుతం అంతే స్పీడ్ గా కెరీర్ పడిపోయింది. ఐదేళ్ల క్రితం నిఖిల్ దగ్గర ఎప్పుడూ ఇద్దరు ముగ్గురు నిర్మాతల అడ్వాన్స్ లు ఉండేవి. ఇప్పుడు ఎంత ఇచ్చినా సినిమా చేస్తాను అని నిఖిల్ ఆఫర్ ఇచ్చినా నిర్మాత లేడు. ఒకప్పుడు వరుసగా సినిమాలు చేయమని నిఖిల్ ను బుక్ చేసుకునేవాళ్ళు. కానీ, ఇప్పుడు నిఖిల్ తో సినిమా చేయడానికి ఎవ్వరూ కనీస […]

Written By: Shiva, Updated On : March 7, 2022 6:07 pm
Follow us on

Ravi teja – Nikhil: ‘నిఖిల్’ కెరీర్ లో చాలా స్పీడ్ గా ఎదిగాడు, ప్రస్తుతం అంతే స్పీడ్ గా కెరీర్ పడిపోయింది. ఐదేళ్ల క్రితం నిఖిల్ దగ్గర ఎప్పుడూ ఇద్దరు ముగ్గురు నిర్మాతల అడ్వాన్స్ లు ఉండేవి. ఇప్పుడు ఎంత ఇచ్చినా సినిమా చేస్తాను అని నిఖిల్ ఆఫర్ ఇచ్చినా నిర్మాత లేడు. ఒకప్పుడు వరుసగా సినిమాలు చేయమని నిఖిల్ ను బుక్ చేసుకునేవాళ్ళు.

Ravi teja

కానీ, ఇప్పుడు నిఖిల్ తో సినిమా చేయడానికి ఎవ్వరూ కనీస ఇంట్రెస్ట్ కూడా చూపించడం లేదు. ఇలాంటి స్థితిలో ఉన్న నిఖిల్ కి ఓ బంపర్ ఆఫర్ తగిలింది. మాస్ మహా రాజా రవితేజ నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో రాబోతున్న కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో ఓ కీలక పాత్ర ఉంది. అయితే, ఆ పాత్రలో యంగ్ హీరో నిఖిల్ నటించబోతున్నాడు.

Also Read:  దీప్తి సునయన మొట్టమొదటి.. చిట్టచివరి విరహ వేదన ఇదేనా? వైరల్ వీడియో

నిఖిల్ కెరీర్ కి ఇది ప్లస్ అవుతుంది. ఎందుకంటే ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. పైగా ఈ సినిమా పక్కా ఎంటర్ టైనర్ మూవీ. అన్నిటికి మించి హీరో రవితేజ. కాబట్టి.. నిఖిల్ కి ఇది మంచి అవకాశం. మళ్ళీ ఫామ్ లోకి రావడానికి ఇది బాగా ఉపయోగించుకోవచ్చు. మరి నిఖిల్ ఈ ఛాన్స్ ను ఎలా వాడుకుంటాడో చూడాలి.

hero nikhil

నిజానికి ఆరేళ్ళ క్రితం నిఖిల్ కి ఒక డైరెక్టర్ వెళ్లి కథ చెప్పడానికి చాలా కష్టపడాల్సి వచ్చేది. అంతగా నిఖిల్ కి అప్పుడు డిమాండ్ ఉండేది. పైగా ఓ దశలో నిఖిల్ కి వరుస హ్యాట్రిక్ హిట్స్ కూడా పడ్డాయి. దాంతో నిఖిల్ రేంజ్ బాగా పెరిగింది.

సడెన్ గా లైమ్ లైట్ లోకి వచ్చాడు. అయితే అదృష్టం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. నిఖిల్ ప్రస్తుతం బ్యాడ్ టైంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. మరి రవితేజ అయినా హిట్ ఇస్తాడా ? చూడాలి.

Also Read: రెమ్యున‌రేష‌న్ కోసం ఆశ ప‌డ్డ ర‌ష్మిక‌.. చివ‌ర‌కు ఎంత పెద్ద దెబ్బ ప‌డింది..!

Tags