Ravi Teja: సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. కారణమేంటంటే వాళ్ళు చేస్తున్న సినిమాలకు ప్రేక్షకుల్లో ఎక్కువ ఆదరణ దక్కుతుంది. రిపిటెడ్ గా ఆ సినిమాను చూసి సూపర్ సక్సెస్ గా నిలుపుతూ ఉంటారు. కాబట్టి వాళ్లు మాత్రమే ఎక్కువ మంది ప్రేక్షకులకు గుర్తుండిపోతారు. ఇక వాళ్లకు మాత్రమే ఎక్కువ సంఖ్యలో అభిమానులు ఏర్పడి కటౌట్లు పెట్టడం, వాళ్ల బర్త్ డే లకు రక్తదానాలు చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. వాళ్ళ సినిమా వచ్చిందంటే చాలు థియేటర్ దగ్గర రచ్చ రచ్చ చేస్తూ ఉంటారు… ఇలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికి రానటువంటి గొప్ప గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న వాళ్ళలో మన తెలుగు హీరోలు మొదటి స్థానంలో ఉన్నారు. మహేష్ బాబు లాంటి నటుడు ప్రస్తుతం రాజమౌళితో ‘వారణాసి’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే ప్రపంచ ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకోవాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు…
మహేష్ బాబు తన కెరీర్ లో ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలను చేసినప్పటికి ఆయన ఇప్పటివరకు కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు. ఆ సినిమాలను కనుక చేసి ఉంటే అతనికి ఇంకా గొప్ప విజయాలు వరించడమే కాకుండా ఇప్పటికే టాప్ హీరో పొజిషన్లో నిలిచేవాడు. మరి మహేష్ బాబు మిస్ చేసుకున్న ఒక సినిమాతో రవితేజ సూపర్ సక్సెస్ ని సాధించాడనే విషయం మనలో చాలామందికి తెలియదు…
డైరెక్టర్ హరీష్ శంకర్ ‘మిరపకాయ్’ సినిమా స్టోరీని మొదట పవన్ కళ్యాణ్ కి వినిపించాడు. ఆయన రిజెక్ట్ చేయడంతో మహేష్ బాబు దగ్గరికి కథ అయితే వెళ్ళింది. ఇక మహేష్ బాబు సైతం అప్పుడు ఉన్న కమిట్మెంట్స్ వల్ల ఆ సినిమాని పెద్దగా పట్టించుకోలేదు.
దాంతో హరీష్ శంకర్ – రవితేజ తో ఈ సినిమాను చేసి సూపర్ సక్సెస్ ని సాధించాడు. ఇక ఈ విషయాన్ని హరీష్ శంకర్ ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా మహేష్ బాబు లాంటి నటుడు ఈ సినిమాని మిస్ చేసుకోవడం వల్ల రవితేజకు ఒక మాస్ హిట్ దక్కింది…